రెక్కాడితేగాని డొక్కాడని కూలి జనం వాళ్లు.. మగ దిక్కులేని ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు. రోజులాగానే మంగళవారం కూడా కూలికెళ్లారు. అంతలోనే వారికి గుండెలు బద్దలయ్యేంత వార్త తెలిసింది. మీ ఇల్లు కాలిపోయిందని ఎవరో చెప్పారు. శరవేగంగా వచ్చి చూస్తే ఇల్లు పూర్తిగా కాలి పోయింది. దాచుకున్న డబ్బు, బంగారు కాలి బూడిదైంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
సంబేపల్లె:
సంబేపల్లె మండలం అడవికమ్మపల్లెలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామంలోని మొక్కిని ఆదెమ్మ, లక్ష్మీదేవి తల్లీకూతుళ్లు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. విద్యుదాఘాతంతో తాము నివసిస్తున్న ఇంటికి నిప్పంటుకుని కాలిపోయిందని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. వాళ్లు అక్కడికి చేరుకుని చూసేసరికి ఏం మిగల్లేదు.
అన్నీ కాలి బూడిదయ్యాయి. ఐదు తులాల బంగారు గాజులు నాలుగు, రూ.45 వేల నగదు కాలి బూడిదయ్యాయి. దీంతోపాటు దుస్తులు, ఆహార ధాన్యాలు మాడి మసైపోయాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తనకు గుండె జబ్బు అని, వైద్యం చేయిం చుకునేందుకు రూ.45 వేలు డబ్బులు పోగు చేసుంటే అది కాలిపోయిందని రోదించారు. ఇక ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించిన తీరు కలచివేసింది.
గూడు కాలి.. బతుకు చెదిరి
Published Wed, Nov 5 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement