purillu
-
పూరింటికి రూ.18 లక్షల కరెంటు బిల్లు
రావికమతం: ఏపీలో అదో పూరిల్లు.. అందులో ఉన్నవి రెండు బల్బులు, ఒక ఫ్యాన్.. మరి ఆ ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు ఎంతో తెలుసా.. అక్షరాలా 18,68,026 రూపాయలు. ఏంటీ.. ఈ అంకెలు చూడగానే షాక్ తిన్నారా! ఆ ఇంటి యజమానురాలి పరిస్థితీ అదే. విశాఖ జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామానికి చెందిన గొంతిన దేముళ్లమ్మ (60) కుమారుడితో కలసి పూరిపాకలో నివసిస్తోంది. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ మాత్రమే ఉన్న ఆ ఇంటికి ప్రతి నెలా రూ.50-60 మధ్య బిల్లు వస్తుంటుంది. ఇదిలాఉండగా జనవరి నెలకు సంబంధించి ఈ నెలలో బిల్లు వచ్చింది. ఎప్పటిలాగే బిల్లు మొత్తం ఉంటుందన్న ధీమాతో ఆమె బిల్లులోని అంకెలను గమనించలేదు. బుధవారం కొత్తకోటలోని మీ సేవా కేంద్రంలోని కౌంటర్లో బిల్లుతో పాటు రూ.వంద నోటు ఇచ్చింది. రూ.18 లక్షలకు పైగా బిల్లు వస్తే రూ.100 ఇచ్చావేమిటని మీసేవ నిర్వాహకుడు ప్రశ్నించడంతో ఆ వృద్ధురాలు ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది. అట్నుంచి అటే రావికమతం వెళ్లి విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఏఈ గొంపస్వామిని వివరణ కోరగా రీడింగ్ నమోదులో జరిగిన పొరపాటు వల్ల అలా జరిగిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. -
మూడు పూరిళ్లు దగ్ధం
- కట్టుబట్టలతో వీధిన పడ్డ మూడు కుటుంబాలు - సుమారు రూ. 17 లక్షల ఆస్తినష్టం పెనుమూరు: మండలంలోని బట్టువారి పల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు కట్టు బట్టలతో వీధిన పడ్డాయి. సుమారు రూ.17 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు, సామిరెడ్డిపల్లె పంచాయతీ బట్టువారిపల్లెలో మోహన్‌నాయుడు, భారతి, విజయ కుటుంబా లు పూరిళ్లలో నివసిస్తున్నారు. ఆదివా రం తెల్లవారుజామున భారతి, విజయ పూరిళ్ల మధ్యలో విద్యుత్ షార్ ్ట సర్క్యూట్ జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. భయంతో ఆ మూడు కుటుంబాల వారు బయటకు పరుగులు తీసారు. క్షణాల్లో మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ గ్రామంకు చేరుకునేలోపు పూరిళ్లుదగ్ధం అయ్యాయి. విజయ, భారతి డ్వాక్రా సంఘంలో ఉన్నారు. వీరికి శనివారం రూ.75 వేలు చొప్పున డ్వాక్రా రుణాలు ఇచ్చారు. పెట్టేల్లో దాచుకున్న ఆ డబ్బు పూర్తిగా దగ్ధమైంది. అలాగే మూడు కుటుంబాలకు చెందిన 40 సవరాల బంగారం, రెండు కిలోల వెండి, 20 బస్తాల వేరుశెనగ కాయలు పూర్తిగా కాలిపోయాయి. మూడు పూరిళ్లలో ఉన్న టీవీలు, బీరువాలు, వంట పాత్రలు, నిత్యవసర వస్తువులు, దుస్తులు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్, రేషన్‌కార్డులు, దుస్తులు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.17 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ వీరపల్లె హరిబాబు నాయుడు బాధిత కుటుంబాలను ఆదివారం ఉదయం పరామర్శించారు. స్థానిక వీఆర్వో కుమార్ జరిగిన ఆస్తి నష్టం అంచానా వేశారు. -
గూడు కాలి.. బతుకు చెదిరి
రెక్కాడితేగాని డొక్కాడని కూలి జనం వాళ్లు.. మగ దిక్కులేని ఆ ఇద్దరు తల్లీకూతుళ్లు. రోజులాగానే మంగళవారం కూడా కూలికెళ్లారు. అంతలోనే వారికి గుండెలు బద్దలయ్యేంత వార్త తెలిసింది. మీ ఇల్లు కాలిపోయిందని ఎవరో చెప్పారు. శరవేగంగా వచ్చి చూస్తే ఇల్లు పూర్తిగా కాలి పోయింది. దాచుకున్న డబ్బు, బంగారు కాలి బూడిదైంది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సంబేపల్లె: సంబేపల్లె మండలం అడవికమ్మపల్లెలో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ పూరిల్లు దగ్ధమైంది. గ్రామంలోని మొక్కిని ఆదెమ్మ, లక్ష్మీదేవి తల్లీకూతుళ్లు. కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తుండేవారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కూలి పనులకు వెళ్లారు. విద్యుదాఘాతంతో తాము నివసిస్తున్న ఇంటికి నిప్పంటుకుని కాలిపోయిందని ఇరుగుపొరుగు వాళ్లు చెప్పారు. వాళ్లు అక్కడికి చేరుకుని చూసేసరికి ఏం మిగల్లేదు. అన్నీ కాలి బూడిదయ్యాయి. ఐదు తులాల బంగారు గాజులు నాలుగు, రూ.45 వేల నగదు కాలి బూడిదయ్యాయి. దీంతోపాటు దుస్తులు, ఆహార ధాన్యాలు మాడి మసైపోయాయి. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ తనకు గుండె జబ్బు అని, వైద్యం చేయిం చుకునేందుకు రూ.45 వేలు డబ్బులు పోగు చేసుంటే అది కాలిపోయిందని రోదించారు. ఇక ఆత్మహత్యే శరణ్యమని బోరున విలపించిన తీరు కలచివేసింది.