మూడు పూరిళ్లు దగ్ధం
- కట్టుబట్టలతో వీధిన పడ్డ మూడు కుటుంబాలు
- సుమారు రూ. 17 లక్షల ఆస్తినష్టం
పెనుమూరు: మండలంలోని బట్టువారి పల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు కట్టు బట్టలతో వీధిన పడ్డాయి. సుమారు రూ.17 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు, సామిరెడ్డిపల్లె పంచాయతీ బట్టువారిపల్లెలో మోహన్‌నాయుడు, భారతి, విజయ కుటుంబా లు పూరిళ్లలో నివసిస్తున్నారు. ఆదివా రం తెల్లవారుజామున భారతి, విజయ పూరిళ్ల మధ్యలో విద్యుత్ షార్ ్ట సర్క్యూట్ జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి.
భయంతో ఆ మూడు కుటుంబాల వారు బయటకు పరుగులు తీసారు. క్షణాల్లో మూడు పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ గ్రామంకు చేరుకునేలోపు పూరిళ్లుదగ్ధం అయ్యాయి. విజయ, భారతి డ్వాక్రా సంఘంలో ఉన్నారు. వీరికి శనివారం రూ.75 వేలు చొప్పున డ్వాక్రా రుణాలు ఇచ్చారు. పెట్టేల్లో దాచుకున్న ఆ డబ్బు పూర్తిగా దగ్ధమైంది. అలాగే మూడు కుటుంబాలకు చెందిన 40 సవరాల బంగారం, రెండు కిలోల వెండి, 20 బస్తాల వేరుశెనగ కాయలు పూర్తిగా కాలిపోయాయి. మూడు పూరిళ్లలో ఉన్న టీవీలు, బీరువాలు, వంట పాత్రలు, నిత్యవసర వస్తువులు, దుస్తులు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్, రేషన్‌కార్డులు, దుస్తులు కాలిపోయాయి. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు రూ.17 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ వీరపల్లె హరిబాబు నాయుడు బాధిత కుటుంబాలను ఆదివారం ఉదయం పరామర్శించారు. స్థానిక వీఆర్వో కుమార్ జరిగిన ఆస్తి నష్టం అంచానా వేశారు.