అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.9 కోట్లతో మూడంతస్తుల భవనాన్ని(జీ ప్లస్ త్రీ) నిర్మించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతించారని ఈఓ నాగేశ్వరరావు గురువారం తెలిపారు.
అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు రూ.9 కోట్లతో మూడంతస్తుల భవనాన్ని(జీ ప్లస్ త్రీ) నిర్మించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతించారని ఈఓ నాగేశ్వరరావు గురువారం తెలిపారు. దేవస్థానంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ ప్రకారం కమిషనర్ అనుమతించిన తొలి నిర్మాణం ఇదేనని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లో వంటశాల, మూడంతస్తుల్లో భక్తులు భోజనం చేసేందుకు హాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం సీఆర్‌ఓ కార్యాలయం దిగువన హాలులో అన్నదానం చేస్తున్నామని, ఈ భవనం నిర్మాణమైతే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రస్తుతం దేవస్థానంలో రోజుకు కనీసం 1,500 మంది నుంచి గరిష్టంగా ఐదు వేల మంది వరకూ అన్నదానం చేస్తున్నారు.