'ఈ జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ'
విజయవాడ:ఈ ఏడాది జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 13 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో నాటు సారా నిరోధానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటివరకూ 70 మందని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 7,800 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి ఏడు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసినట్లు రవీంద్ర పేర్కొన్నారు.