kollu ravindhra
-
ప్రైవేట్ చేతుల్లోకే ‘లిక్కర్’.. చంద్రబాబు సర్కార్ స్కెచ్ రెడీ
సాక్షి, గుంటూరు: మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యలతో కూటమి సర్కార్ బండారం బట్టబయలైంది. లిక్కర్ సిండికేట్లకే మద్యం షాపులు కేటాయింపునకు చంద్రబాబు ముందే నిర్ణయించినట్లు తేటతెల్లమైంది. ప్రైవేటు వ్యక్తులకే షాపులంటూ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.ప్రైవేటు షాపులే వస్తాయి..ప్రైవేటు వాళ్లకే ఇస్తామంటూ మద్యం షాపుల సిబ్బందితో కొల్లు రవీంద్ర చెప్పారు. నిర్ణయం తీసేసుకుని సబ్ కమిటీ ఏర్పాటు అంటూ చంద్రబాబు ప్రభుత్వం డ్రామాకు తెరతీస్తూ.. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్ , సత్యకుమార్, గొట్టిపాటి రవితో కమిటీ ఏర్పాటైంది.ప్రైవేటు వ్యక్తులకు మేలు చేసేలా ఉప సంఘం నివేదిక ఇవ్వనుంది. మళ్లీ పాత పద్దతిలో ఇష్టా రీతిన అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కార్ రెడ్ కార్పెట్ సిద్ధం చేసింది. టీడీపీ నేతలకు, లిక్కర్ సిండికేట్లకు షాపులు ఇచ్చేందుకు స్కెచ్ రెడీ వేసింది. -
సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర
సాక్షి, మచిలీపట్నం/రాజమహేంద్రవరం క్రైం: వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మచిలీపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్రను సోమవారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నిందితులు చింతా చిన్నీ, చింతా నాంచారయ్య (పులి), నాగమల్లేశ్వరరావు, వంశీకృష్ణతోపాటు మరో మైనర్ని కూడా ప్రత్యేక బందోబస్తు మధ్య రాజమహేంద్రవరం తరలించారు. మచిలీపట్నంలోని సబ్ జైలులో సరైన సౌకర్యాలు లేనందున.. నిందితులను రిమాండ్ నిమిత్తం నేరుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించాలని కొల్లు రవీంద్ర తరఫు న్యాయవాది కోరగా.. జడ్జి తోసిపుచ్చారు. సోమవారం మరోసారి కొల్లు తరఫు న్యాయవాదులు ఇదే విషయమై సబ్ జైలర్‌కు లిఖితపూర్వకంగా విజ్ఞప్తి సమర్పించగా.. ఆయన కోర్టుకు రిఫర్ చేశారు. మచిలీపట్నం జిల్లా కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జె.శ్రీనివాస్ దానిపై సానుకూలంగా స్పందిస్తూ.. నిందితుల్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించేందుకు అనుమతిచ్చారు. దీంతో సోమవారం సాయంత్రం ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య కొల్లు రవీంద్రతోపాటు మిగిలిన నిందితులను కూడా రాజమహేంద్రవరం తరలించారు. (‘పేరు బయటకు రాకుండా మర్డర్ ప్లాన్’) -
రాజమండ్రి సెంట్రల్ జైలుకు కొల్లు రవీంద్ర
-
కాల్ డాటా ఆధారంగానే రవీంద్ర అరెస్టు: ఎస్పీ
-
బందరు తీరం చైతన్య పథం
సాక్షి, మచిలీపట్నం : బందరు ప్రాచీన, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం కలిగిన నియోజకవర్గం. విదేశీయులు(డచ్) వ్యాపారాలు నడిపిన ప్రాంతం. భారత దేశంలోనే మూడో మున్సిపాలిటీ కాగా.. రాష్ట్రంలో రెండో మున్సిపాలిటీగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. మచిలీపట్నం నియోజకవర్గానికి ఎందరో ఉద్దండులైన రాజకీయ నాయకులను అందించిన ఘనత ఉంది. అంతటి ఘన చరిత్ర కలిగిన బందరులో రాజకీయ చైతన్యం సైతం అదే స్థాయిలో ఉంది. కాపుల హవా ఎక్కువగా ఉండగా.. ద్వితీయ స్థానంలో మైనార్టీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి అసెంబ్లీ అభ్యర్థి గెలుపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నానుడి సైతం ప్రాచుర్యంలో ఉంది. అంతే కాకుండా సీఎం హోదాలో బందరు పర్యటనకు వస్తే తర్వాతి ఎన్నికల్లో అతని పరాజయం సాధించడం ఖాయమన్న వాదన సైతం జోరుగా ఉంది. 16 సార్లు ఎన్నికలు బందరు నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత 1952లో ఎన్నికలు నిర్వహించగా.. అంతకు ముందు సమితి అధ్యక్షుల ప్రక్రియ కొనసాగేది. 16 సార్లు జరిగిన ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్, కాంగ్రెస్–ఐ పార్టీలకు సంబంధించి ఏడుగురు అభ్యర్థులు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థులు ఆరు సార్లు, సీపీఐ, జనతా, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి గెలుపొందారు. ఇక్కడి నుంచి గెలిచిన అంబటి బ్రహ్మణయ్య 2009లో అవనిగడ్డ నియోజకవర్గంలో పోటీ చేసి విజయఢంకా మోగించారు. ఎంపీగా సైతం ఐదేళ్ల పాటు కొనసాగారు. ఇక్కడ గెలిచిన వారిలో వడ్డిరంగారావు గతంలో ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేస్తే, కృష్ణమూర్తి నేదురుమల్లి క్యాబినెట్లో, 1999లో ఎన్నికైన నరసింహారావు ఆనాటి చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. హ్యాట్రిక్ వీరుడు లక్ష్మణరావు బందరు నియోజకవర్గం నుంచి పెదసింగు లక్ష్మణరావు మూడు పర్యాయాలు వరుస విజయంతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. 1962లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాళ్లపల్లి వెంకటరామయ్యపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. 1967, 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. రికార్డు మెజార్టీ పేర్ని నానీకే 16 పర్యాయాలు నిర్వహించిన ఎన్నికల్లో ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బందరు నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని నాని రికార్డు స్థాయి మెజార్టీ దక్కించుకున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో తొలి సారి పోటీ చేసి.. ప్రత్యర్థి అయిన టీడీపీ అభ్యర్థి నడకుదిటి నరసింహారావుపై 31,301 ఓట్ల ఆధిక్యం సాధించారు. 2019 ఎన్నికల్లో పీఠమెవరిదో? ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల సమయం ఆసన్నమైంది. వైఎస్సార్ సీపీ నుంచి పేర్ని నాని, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర బరిలోకి దిగనున్నారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందలేదన్న ఆపవాద మూటగట్టుకుంది. బందరు పోర్టు నిర్మాణం చేపట్టకపోగా.. భూ సేకరణ, సమీకరణ పేరుతో రైతులను నానా ఇబ్బందులకు గురి చేసింది. ఈ పరిణామం టీడీపీకి ఓటమి తెచ్చి పెడుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి నానీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వినవస్తున్నాయి. నియోజకవర్గ జనాభా : 1,75,698 పట్టణంలో వార్డులు : 42 పంచాయతీలు : 34 ఓటర్ల వివరాలు : 1,84,506 పురుషులు : 90,146 మహిళలు : 94,348 ఇతరులు : 12 -
సమస్యలు కో‘కొల్లు’లు..
సాక్షి, మచిలీపట్నం : ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కొల్లు రవీంద్ర చేసింది శూన్యమని ప్రజలు విమర్శిస్తున్నారు. కొల్లు స్వగ్రామంగా చెప్పుకునే ‘గరాల దిబ్బ’ సమస్యలతో సతమతమవుతోంది. ‘మంత్రి మనోడే’ నని సమస్యలు తీరకపోతాయా...? అని ఐదేళ్లు పాటు ప్రజలు ఆశగా ఎదురుచూసినప్పటకీ, మౌలిక వసతులు మెరుగపడలేదు. గ్రామంలో అంతా మత్స్యకారులే. నిరుపేదలైన వీరికి ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు కూడా సవ్యంగా అందలేదు. తాగునీటికి తీవ్రమైన ఇక్కట్లు పడుతున్నారు. తమ ఇబ్బందులు చెబితే ఎక్కడ తమకు వచ్చే సంక్షేమ పథకాలకు అడ్డం పడతారేమోననే ఆందోళన ఇక్కడి ప్రజానీకంలో ఉంది. అర్హులకు అందని పథకాలు గ్రామంలో అర్హులకు రేషన్ కార్డులు లేవు. చదువులపై మంచి ఆసక్తి చూపే యువత ఉన్న గ్రామంలో ఒకప్పుడు 72 మంది ఉద్యోగులు ఇక్కడ ఉండేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇక్కడి వారు ఉద్యోగాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. గ్రామం చుట్టూ అసైన్డ్ భూములున్నా తాతలు, తండ్రులు నాడు ఇచ్చిన హక్కు పత్రాలే దిక్కయ్యాయి. ప్రస్తుతం ఎలాంటి పత్రాలు ఇవ్వకపోవటంతో ఒకే ఇంట్లో మూడేసి కుటుంబాలు నివసిస్తున్నారు. సీసీ రోడ్లు నిర్మించినా.. మురుగు వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు ఇళ్లవద్దనే నిల్వ ఉంటున్నాయి. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు అలంకార ప్రాయంగా మారాయి. దీంతో ప్రజలు గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ప్రతీ రోజూ‘పానీ’ పాట్లే! గరాలదిబ్బ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గ్రామంలో చేతిపంపులు ఉన్నప్పటకీ, ఉప్పునీరు కావటంతో మునిసిపాలిటీ వారు సరఫరా చేసే తాగునీరే ఆధారం. ఇవి కూడా రోజు విడిచి రోజు వస్తుంటాయి. దీంతో నల్లాల నుంచి వచ్చే సన్నటి ధార కోసం బిందెలు పట్టుకొని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. తాగునీటికి కష్టాలు బిందెడు మంచినీళ్లు పట్టుకునేందుకు పైపుల వద్ద గంటల తరబడి ఉండాలి. వీధుల్లో ఉన్న నల్లాల వద్ద మంచినీళ్లు పట్టుకునేందుకు బిందెలు ముందుగానే వరుసుగా పట్టాలి. రోజులో ఒక్కసారి అది కూడా ఒక గంట మాత్రమే నీళ్లు వస్తుంటాయి. చేతి పంపులు ఉన్నప్పటకీ, ఉప్పు నీరు కావడంతో తాగలేం. నల్లాల నుంచి వచ్చే నీరు రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. – కె.జయంతి ఆర్భాటపు ప్రచారం నిరుద్యోగ భృతి మంజూరు చేయాలంటూ అధికారులకు అర్జీ ఇచ్చాను. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. డిగ్రీ చదివి కుటుంబం గడువడానికి కూలి పనులకు వెళ్తున్నాను. ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలే తప్ప నాలాంటి అర్హులైన వారికి న్యాయం చేయటం లేదు. – ఒడుగు దుర్గారావు -
బ్రోకర్ పనులు చేయడం తప్ప అభివృద్ధి ఏం చేశావ్!
కృష్ణా, మచిలీపట్నంటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు, మంత్రి నారా లోకేష్‌బాబుకు బ్రోకర్‌గా పనిచేస్తూ ముడుపులు ఇవ్వటం తప్ప బందరుకు చేసిందేముందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్రను వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రశ్నించారు. స్థానిక రామానాయుడుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మంత్రి పదవిని కాపాడుకునేందుకు లోకేష్‌కు ముడుపులు ఇచ్చి బ్రోకర్ పనులు చేశావే తప్ప బందరు పోర్టు నిర్మాణానికి నాలుగేళ్లుగా చేసిందేమిటో చెప్పాలన్నారు. బందరులో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని పదే పదే చెప్పుకోవడం తప్ప ఒక్క పరిశ్రమకైనా శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. బందరులో ఉన్న ఏకైక బెల్ కంపెనీని లోకేష్ దత్తత గ్రామం నిమ్మకూరుకు తరలిస్తుంటే చూస్తూ మౌనంగా ఉన్నావన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పోర్టు నిర్మాణానికి రూపొందించిన మ్యాప్‌లను చూస్తూ ఫొటోలు దిగి ప్రచారం పొందటం తప్ప పోర్టు కోసం చేసిన కృషి చెప్పాలన్నారు. పోర్టు, అనుబంధ పరిశ్రమలకుగానూ 33వేల ఎకరాల భూమిని సేకరించేందుకు జారీ చేసిన నోటిఫికేషన్ వల్ల రుణాలు రాక, భూముల క్రయవిక్రయాలు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చందన మస్తానరావు హైకోర్టును ఆశ్రయించగా, నోటిఫికేషన్ ద్వారా భూములు తీసుకోవటం లేదని కలెక్టర్ హైకోర్టుకు లేఖ రాశారని, ఈనెల 3వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడటం ఏమిటని ప్రశ్నించారు. తనను గెలిపిస్తే సొసైటీ భూమికి పట్టాలు ఇప్పిస్తానని కుమ్మరిగూడెం కుమ్మరులను ప్రాథేయపడి తీరా అధికారం వచ్చాక సొసైటీ భూమిలోనే స్టేడియం నిర్మించాలని చూడడం న్యాయమా అని ప్రశ్నించారు. పేద వర్గాలపై అధికార జులుం ప్రదర్శిస్తే వారికి అండగా ఉంటానే తప్ప ఎవరికీ భయపడేది లేదన్నారు. కాంట్రాక్టర్లు నీ మామ, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావుకు, నీకు ముడుపులు చెల్లిస్తేనే పనులు చేయిస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీచ్ ఫెస్టివల్ పేరుతో కోట్లాది రూపాయలు దండుకోలేదా అని ప్రశ్నించారు. నీరు అందక రైతులు సాగు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నా మీరు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇవే పట్టని మీరు అభివృద్ధికి నేను అడ్డుపడుతున్నానని ప్రజలకు అబద్ధాలు చెప్పడం సరికాదని నాని అన్నారు. -
'ఈ జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ'
విజయవాడ:ఈ ఏడాది జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 13 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో నాటు సారా నిరోధానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 70 మందని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 7,800 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి ఏడు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసినట్లు రవీంద్ర పేర్కొన్నారు. -
త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఐడీ లిక్కర్ రాకుండా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే బందర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.