సాక్షి, హైదరాబాద్: జైళ్ల శాఖలోని 569 మంది కొత్త వార్డర్లకు వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇచ్చేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వార్డర్లు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని జైళ్ల వార్డరను జోన్ల వారిగా గాక, రాష్ట్రవ్యాప్తంగా బదిలీలు చేసేలా నిబంధనలు ఉన్నాయి.
దీంతో వారు నివసించే ప్రాంతాల నుంచి సుదూర ప్రాం తాల్లో పోస్టింగ్‌లు ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు.. వార్డర్లకు సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. హోంశాఖ దీనికి ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇటీవల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 569 మంది వార్డర్లకు (ఇందులో 34మంది మహిళలు) సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు ఇవ్వనున్నామని జైళ్ల శాఖ ఐజీ సునీల్ కుమార్ తెలిపారు.
జైళ్ల శాఖలో సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లు
Published Wed, Jan 22 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM
Advertisement
Advertisement