నింగికేగిన ఉద్యమ జోషి | NGO leader Damodar Joshi dies of heart attack | Sakshi
Sakshi News home page

నింగికేగిన ఉద్యమ జోషి

Published Tue, Feb 18 2014 5:28 AM | Last Updated on Wed, Oct 17 2018 5:10 PM

NGO leader Damodar Joshi dies of heart attack

 ఉద్యమజ్యోతి నింగికేగింది. ‘పోరాడితే పోయేదేం లేదు విభజన ముప్పు తప్ప’ అనే స్ఫూర్తితో పోరాడిన ఎన్‌జీఓ నేత దామోదరజోషి గుండె ఆగింది. సమైక్యమే ఊపిరిగా ఉద్యమించారాయన. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే  అనర్థాలు ఆయన మనసులో కల్లోలం రేపాయి. ఎలాగైనా సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే అకుంఠిత దీక్షతో ఢిల్లీ నడివీధిలో సీమాంధ్రుల వాణిని ఎలుగెత్తి చాటేందుకు సహచరులతో కలిసి వెళ్లారు. సమైక్య సమరంలో చివరకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.  
 
 నెల్లూరు (టౌన్), న్యూస్‌లైన్: సమైక్య సమరంలో వీర మరణం చెందిన దామోదర జోషిది ఉద్యమ కుటుంబం. జోషి సోదరులు ప్రజా ఉద్యమాల్లో చు రుగ్గా పాల్గొన్నారు. ఎంతో మందికి సాయం చేశారు. సహచర ఉద్యోగుల తో పాటు స్థానికులతో శభాష్ అనిపిం చుకునేలా నడుచుకున్నారు. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడుకు చెందిన దామోదరజోషి నెల్లూరులో కుటుంబం తో ఉంటున్నారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తింస్తున్నారు. సమై క్య ఉద్యమంలో భాగంగా పంచాయతీరాజ్ తరపున ఢిల్లీ ఆందోళనకు వెళ్లి సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జోషి మృతితో జిల్లా ప్రజానీకంతో పాటు ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన జోషికి పలు మండల కార్యాలయాల్లో ఎక్కడికక్కడే శ్రద్ధాంజలి ఘటించారు.
 కుప్పకూలిన కుటుంబ సభ్యులు
 జోషి మరణ వార్త తెలుసుకున్న కుటుం బసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలారు. జోషి భార్య మేరి స్థానిక కేఎన్‌ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి ఒక కుమార్తె లాస్య, కుమారుడు సంతోష్ ఉన్నారు. కుమార్తె బీటెక్ పూర్తి చేసుకుని సూళ్లూరుపేటలో డ్వామాలో ఔట్‌సోర్సింగ్ కింద ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. భర్త మరణ వార్తను విన్న భార్య మేరి ఒక్కసారిగా కేఎన్‌ఆర్ పాఠశాలలో కుప్పకూలారు. సహచర ఉపాధ్యాయులు ఆమెను అయ్యప్పగుడి సమీపంలో ఉన్న టీచర్స్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకొచ్చారు. స్నేహితులు, బంధువులు అనునయిస్తున్నప్పటికీ ఆమెను ఓదార్చడం కష్టమైంది. కుమార్తె, కుమారుడు ఓమూల కూర్చొని  కుమిలి, కుమిలి  ఏడవడం చూసి ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు.  
 విద్యార్థి దశ నుంచే
 ఉద్యమాల వైపు..
 హైస్కూల్ స్థాయిలోనే ఎస్‌ఎఫ్‌ఐ వైపు జోషి ఆకర్షితుడయ్యారు. ఐటీఐ చదువుతూ విద్యార్థి సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఉద్యమించారు. ఉద్యోగం వచ్చాక కూడా 1990లో జన విజ్ఞాన వేదిక తరపున రాత్రి బడుల్లో అక్షరాస్యత కార్యక్రమంలో పని చేశారు. సోదరులు షార్‌లో, ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యమించారు.  
 ఉద్యోగ ప్రస్థానం
 టైపిస్టు స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా , సూపరింటెండెంట్‌గా పనిచేస్తూనే సర్వీసులోనే మరణించారు. పొదలకూరు, నెల్లూరు పంచాయతీరాజ్, జెడ్పీ కార్యాలయం, మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు.
 
 జోషి మృతికి ఎంపీ మేకపాటి సంతాపం
 ఎన్‌జీఓ నేత దామోదరజోషి మృతికి వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఢిల్లీ నుంచి ఎంపీ ‘న్యూస్‌లైన్’తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఢిల్లీలో సమైక్య పోరులో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోవడం ఉద్యమానికి తీరనిలోట న్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. జోషి ఆశయ సాధనకు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. మృతుడి కుటుంబ సభ్యులకు మేకపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement