ఎన్జీవోస్‌కాలనీ, న్యూస్‌లైన్: సీమాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యే లు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. ముల్కి అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని తెలంగా ణ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండలోని కాళోజీ జంక్షన్‌లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే బిక్షపతి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో ఉద్యమం పెట్టుబడిదారులు, రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతోందని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తానంటే తానే అడ్డుకున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటన్నారు. హైదరాబాద్ కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఉద్యోగ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు మాట్లాడుతూ హైకోర్టు సీమాంధ్ర ఉద్యమంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిందని, ఊహజనితమైన నిర్ణయంపై ఎలా సమ్మెకు దిగుతారని అక్కడి ప్రజలను ప్రశ్నించిందని తెలిపారు. సీమాంధ్రలో సమ్మెను నిరోధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, ఏపీ ఎన్జీఓలు చేస్తున్న సమ్మె రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు ఉద్యమాన్ని ఆపది లేదన్నారు. కాగా, దీక్షలకు టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రత్నవీరాచారి, నాయకుడు ధరం సింగ్, రత్నాకర్‌రెడ్డి, టీజీఏ రాష్ర్ట అధ్యక్షుడు యాదవరెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్‌మోహన్‌రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, నా లుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ హుస్సేన్, టీజేఏసీ జిల్లా చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, టీవీవీ రా ష్ర్ట ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ సీతారామారావు సంఘీభావం తెలిపారు. దీక్షలో పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సాదుల ప్రసాద్, తెలంగాణ పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు జవహర్‌రెడ్డి, డిప్లమో ఇంజినీర్ అసోసియేషన్ ప్రతినిధులు గట్ల మహిపాల్‌రెడ్డి, పులి ప్రభాకర్, నాయకులు బొట్ల బిక్షపతి, ధర్మరాజు, రాజారపు భాస్కర్, నాగపురి ప్రభాకర్, శేఖర్, నాగరాజు, రమేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ ఏర్పాటును అడ్డుకోలేరు
Published Wed, Sep 4 2013 6:57 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
Advertisement