బాన్సువాడ టౌన్, న్యూస్‌లైన్:
సీమాంధ్రలో ఆయా పార్టీల నాయకులే ఉద్యమాన్ని నడిపిస్తున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై సీడబ్ల్యుసీ తీసుకు న్న నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజధానితో కూడిన పది జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని కోరారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం కేవలం అక్కడి నాయకులే నడిపిస్తున్నారని, అది ప్రజల నుంచి పుట్టుకొచ్చింది కాదన్నారు. పెట్టుబడి దారులు, రాజకీయ నాయకు లే ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లో కూర్చొని సమావేశాలు పెట్టుకుంటే తె లంగాణ రాదని, ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేయాలని సూచించారు. జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 30న హైదరాబాద్‌లో తెలంగాణ మేధావులు, విద్యావంతు లు,కళాకారులతో సభ ఉంటుందన్నారు.
రేపు ఈటెల రాజేందర్ రాక
బాన్సువాడ మీనా గార్డెన్‌లో సోమవారం నిర్వహించే నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ వస్తున్నారని పోచారం తెలిపారు. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ మద్దతుదారుల సర్పంచులు, సహకార సంఘం అధ్యక్షులను సన్మానించనున్నట్లు చెప్పారు.
సీమాంధ్ర ఉద్యమం సృష్టించింది నాయకులే..
Published Sun, Sep 15 2013 6:42 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
Advertisement