మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఏడు మున్సిపాలిటీల పరిధిలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.
బెల్లంపల్లి, న్యూస్‌లైన్ : మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఏడు మున్సిపాలిటీల పరిధిలోని ఔట్‌సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మంగళవారంతో నిరవధిక సమ్మె నాలుగో రోజు కు చేరుకుంది. ఔట్ సోర్సింగ్ కార్మికులు విధులు బ హిష్కరించి సమ్మె చేస్తుండటంతో మున్సిపాలిటీల్లో చెత్తాచెదారం పేరుకుంది.
మురికి నీటి కాలువల్లో పూడిక పేరుకుపోయి దుర్గంధం ప్రబలుతోంది. అత్యవసర (తాగునీరు, విద్యుత్) సిబ్బంది ఆయా విభాగాల్లో ప్రజలకు సేవలు అరకొరగా అందుతున్నాయి. మున్సిపల్ యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
లోపించిన పారిశుధ్యం
సాధారణంగా ఒకరోజు సమ్మె చేస్తేనే మున్సిపాలిటీలో రహదారులు, వీధులు చెత్త కుప్పలుగా మారుతాయి. నాలుగులుగా ఔట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. అతి తక్కువ మంది రెగ్యులర్ పారిశుధ్య కార్మికులు ఉండటంతో మున్సిపాలిటీల్లో చెత్త ఏరివేత కార్యక్రమం తంతుగా సాగుతోంది. మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రణదీవేనగర్, లీలానగర్, గడియార్‌గల్లి, బొక్కల గూడ, అంబేద్కర్‌నగర్, ఖానాపూర్, కుర్షీద్‌నగర్, సుందరయ్యనగర్‌లలో పారిశుధ్య నిర్వహణ కొరవడింది.
నిర్మల్ మున్సిపాలిటీలోని ఇంద్రానగర్, బంగల్‌పే ట్, రాంరావుబాద్, నాయుడువాడ, తాల్వాగడ్డ, ఈద్గాం, విశ్వనాథ్‌పేట్, గొల్లపేట్, రాంనగర్, ఆదర్శ్‌నగర్, భాగ్యనగర్,శాస్త్రీనగర్‌లలో వీధులు చెత్తచెదారంతో ఉంటున్నాయి. మురికినీటి కాలువల్లో నీ రు స్థిరంగా నిలిచిపోయి దుర్గంధం ప్రబలుతోంది.
మంచిర్యాల మున్సిపాలిటీలో మార్కెట్‌రోడ్, ఒడ్డెరకాలనీ, ఎన్టీఆర్ కాలనీలలో పారిశుధ్యం లోపించి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. చెత్త తొలగింపు కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదు.
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని సర్‌సిల్క్ కాలనీ, సర్ధార్‌బస్తీ, సంఘం బస్తీలలో కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె మూలంగా చెత్తచెదారం రహదారులు, వీధులలో కుప్పలు, తెప్పలుగా పడి ఉంటుంది.
మందమర్రి మున్సిపాలిటీలోని దీపక్‌నగర్, యాప ల్, అంగడి బజార్, ఎస్సీ, ఎస్టీ కాలనీ, బస్టాండ్ ఏరియా ప్రాంతాల్లో చెత్త పేరుకుంది. మురికినీటి కాలువలను రోజులు గడిచిన శుభ్రం చేయడం లే దు. చెత్తను ఏరివేసేందుకు సరిపడా సిబ్బంది లేక కాలనీలు అపరిశుభ్ర వాతావరణంతో ఉన్నాయి.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో హన్మాన్‌బస్తీ, టేకులబ స్తీ, కన్నాలబస్తీ, సుభాష్‌నగర్, నంబర్ 2 ఇంక్లైన్, స్టేషన్‌రోడ్ కాలనీ, కాల్‌టెక్స్ ఏరియా, రైల్వేస్టేషన్, పెద్దనపల్లి, బూడిదగడ్డ బస్తీ, బాబు క్యాంపు, బెల్లంపల్లి బస్తీ, గోల్‌బంగ్లా ప్రాంతాల్లో వీధులు, రహదారులపై చెత్తకుప్పలు దర్శన మిస్తున్నాయి. మురికి నీటి కాలువల గురించి చెప్పనక్కర లేదు.భైంసా మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పింది.
డిమాండ్లు..
మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.12,500 చెల్లించాలి.
{పభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ చెల్లిం చాలి.
{పావిడెంట్ ఫండ్ ప్రతి కార్మికుడికి బ్యాంకు అకౌం ట్ నంబర్ ఇచ్చి ఆ అకౌంట్‌లోనే జమ చేయాలి.
మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి ఔట్‌సోర్సింగ్ కార్మికుడికి ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలి.
గృహ సదుపాయం కల్పించాలి.
{పతి ఆరు నెలలకోసారి గ్లౌజ్‌లు, మాస్కులు, చీపు ర్లు ఇతర నాణ్యమైన పనిముట్లు సరఫరా చేయాలి.
దీర్ఘకాలం నుంచి పని చేస్తున్న కార్మికులందరికి పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి.
వయస్సు పైబడిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుం బంలో మరొకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి.