
అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ముంపు: జెడి శీలం
ఒంగోలు: కేంద్ర మంత్రి జెడి శీలం ప్రకాశం జిల్లాలో వరద ముంపునకు గురైన పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, ప్రకాశం జిల్లా అధికారుల మధ్య సమన్వయ లోపంతో వరద ముంపు ఏర్పడిందన్నారు.
చిన్న, సన్నకారు రైతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఆశిస్తున్నానన్నారు. కేంద్రం నుంచి ఎక్కువ నష్టపరిహారం వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. కౌలు రైతులకు నేరుగా నష్టపరిహారం వచ్చేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
భారీ వర్షాలు, వరదలకు ప్రకాశం జిల్లాలో ఎక్కువ నష్టం విషయం తెలిసిందే. వాగులు, వంకలు తెగి భారీ మొత్తంలో పంటలు నష్టపోయాయి.