నగరపాలక సంస్థలో కలహాలపై అసహనం సీఎం అసహనం
మేయర్‌కు క్లాస్!
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మేయర్ కోనేరు శ్రీధర్‌కు క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అంతర్గత కల హాలతో పార్టీకి చేటు తీసుకొస్తే సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. రెండు రోజులపాటు నగరంలో బస చేసిన సీఎం కార్పొరేషన్ కలహాలపై పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకున్నారు.
టీడీపీ కార్పొరేటర్లలో ఒక వర్గం, మేయర్ మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుసుకున్న ఆయన పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఐదు నెలల్లోనే వివాదాస్పదంగా మారడం మంచిది కాదని మేయర్‌కు చురకలు అంటించినట్లు తెలిసింది. అందరూ కలిసి ఉంటేనే పార్టీ బలంగా ఉంటుదని, తీరుమార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం.
పార్టీకి చేటు తేవద్దు
Published Sun, Dec 14 2014 3:22 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement