
'గడువు వద్దంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తాం'
తెలంగాణ బిల్లుపై గడువు పెంచొందంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై గడువు పెంచొందంటూ రాష్ట్రపతికి లేఖ రాస్తామని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. విభజన బిల్లుపై చర్చకు మరింత సమయం కావాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలు కోరడం సమంజసం కాదన్నారు. తెలంగాణ బిల్లు అంశంపై గురువారం మీడియాతో మాట్లాడిన గండ్ర..సీమాంధ్ర నేతల వైఖరిని తప్పుబట్టారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు దుర్వినియోగం చేసి మరింత సమయం కావాలని పట్టుబట్టడం కుట్రలో భాగమేనన్నారు.
ఈ మేరకు టి.ఎమ్మెల్యేలమంతా కలిసి రాష్ట్రపతికి లేఖ రాస్తామన్నారు. అసెంబ్లీలో చర్చకు మిగిలిన ఏడు రోజులు పూర్తిగా వినియోగం చేసుకుని ఈ నెల 23 వ తేదీలోపు చర్చలు పూర్తి చేయాలని గండ్ర సూచించారు. ఒకవేళ గడువు పెంచాలని తీర్మానం చేయాలని చూస్తే మాత్రం అడ్డుకుంటామని హెచ్చరించారు.