
సాక్షి, విజయవాడ : ఆర్‌సెప్ (ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)లో భారత దేశం చేరకుండా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విధానం వల్ల మనదేశానికి చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండే దేశాలకే ఈ విధానం ద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మన దేశ ఎగుమతులు 6513 వేల కోట్ల డాలర్లు. దిగుమతులు 17540 వేల కోట్ల డాలర్లు. 16 దేశాల ఒప్పందంలో చేరి ఉంటే మన రైతులు తీవ్ర సంక్షోభంలో వెళ్లేవారు. ప్రధాని నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ తరపున స్వాగతిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఎగుమతులు, దిగుమతులు, బీమా, ఎరువుల ధరలు, గిట్టుబాటు ధరలు వంటివి కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేయాలని నాగిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment