nvs nagireddy
-
ప్రధానికి అభినందనలు : ఎంవీఎస్ నాగిరెడ్డి
సాక్షి, విజయవాడ : ఆర్సెప్ (ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్యం)లో భారత దేశం చేరకుండా నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి అభినందనలు తెలుపుతున్నానని రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విధానం వల్ల మనదేశానికి చాలా నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. దిగుమతుల కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండే దేశాలకే ఈ విధానం ద్వారా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. మన దేశ ఎగుమతులు 6513 వేల కోట్ల డాలర్లు. దిగుమతులు 17540 వేల కోట్ల డాలర్లు. 16 దేశాల ఒప్పందంలో చేరి ఉంటే మన రైతులు తీవ్ర సంక్షోభంలో వెళ్లేవారు. ప్రధాని నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తరపున స్వాగతిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు ఎగుమతులు, దిగుమతులు, బీమా, ఎరువుల ధరలు, గిట్టుబాటు ధరలు వంటివి కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే ముందు రాష్ట్రాలను కూడా భాగస్వాములను చేయాలని నాగిరెడ్డి కోరారు. -
సీమ ప్రాజెక్టులకు ఇచ్చేది ఇంతేనా!
రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు ఎన్వీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. రాయలసీమలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రూ. 8 వేల కోట్లు అవసరం అవుతాయని, కానీ వాటికి కేవలం రూ. 500 కోట్లు మాత్రమే ఇవ్వడం దుర్మార్గం.. దారుణమని ఆయన విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని నాగిరెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తామంటూ చంద్రబాబు, మంత్రులు మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకుండా అక్కడకు నీళ్లు ఎలా ఇస్తారని నాగిరెడ్డి నిలదీశారు. పట్టిసీమతో పోలవరానికి ప్రమాదమని, చంద్రబాబు కేవలం తన లబ్ధి కోసమే పట్టిసీమ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.