- టీడీపీ ప్రభుత్వంలోనైనా చట్టబద్ధత కల్పించాలి
- నిర్లక్ష్యం చేస్తే మహా సంగ్రామం తప్పదు
- మందక్రిష్ణ మాదిగ
మదనపల్లె: రాష్ట్రంలో, కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కాం గ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్సీ వర్గీకరణ జరగలేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందక్రిష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం బుధవారం మదనపల్లెలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విస్తృత సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరించాయని, మొన్న జరిగిన ఎన్నిక ల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టాయన్నారు. వాటికనుగుణంగా వెంటనే రాజ్యాంగ సవరణ చేసి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించి మాట నిలబెట్టుకోవాలన్నారు.
ఈ ప్రభుత్వాలు కూడా మాదిగలను విస్మరిస్తే మరో మెరుపు ఉద్యమానికి శ్రీకారం చుట్టా ల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇందులో భాగంగానే మాదిగ ఉపకులాల ప్రజలను ఉద్యమాలకు అప్రమత్తం చేసేందుకు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నామని తెలిపారు. ఈనెల 27వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి మాదిగ శ్రేణుల ను సమాయత్తం చేస్తామన్నారు.
రాష్ట్రస్థాయి కమిటీలతో పాటు జిల్లా, మం డల, గ్రామ కమిటీలను ఎంపిక చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ సాధిస్తామన్నారు. ప్రభుత్వా లు తమ మాట నిలబెట్టుకుని అన్యాయమైపోతున్న ఎస్సీ ఉపకులాలకు న్యాయం చేయాలని మందక్రిష్ణ కోరా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేంద్రబాబు, ఎఇ ఎఫ్ రాష్ట్ర నాయకులు మంచూరి మా రప్ప, రాష్ట్ర నాయకులు పిల్లి మాణిక్యరావు, గిరిజన నాయకులు దివాకర్, యువసేన అధ్యక్షులు గౌతమ్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉన్నారు.