బంధువుల నుంచి ప్రాణభయం
శ్రీకాకుళం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణభయం ఉందని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన కోరాడ సురేష్, జ్యోతి శనివారం డీఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. వేర్వేరు కులాలకు చెందిన తాము గత కొంత కాలం ప్రేమించుకున్నామని, తమ వివాహానికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదన్నారు. తమకు వేరే సంబధాలు చూస్తుండడంతో మేజర్లయిన తాము ఈనెల 17న హైదరాబాద్ వెళ్లామన్నారు.
అక్కడి షాపూర్‌నగర్ సమీపంలోని హెచ్‌ఎంటీ కాలనీ సీతారామ ఆలయ దేవస్థానంలో స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నామని తెలిపారు. తమ కుటుంబ సభ్యులైన కోరాడ సతీష్, పల్లి రమణ, చిట్టి రామకృష్ణలు తమ ను బెదిరించి తీసుకువెళ్లారన్నారు. గ్రామంలో రాజకీయ కక్షల్లో భాగంగా ఒక వర్గానికి చెందిన వారు ఈ నెల 20న కోరాడ రమణయ్య, కోరాడ సతీష్, కోరాడ నరేష్‌ల ప్రోత్సాహంతో దాడి చేశారన్నారు. దీనిపై పోలీసులకు తెలిపామన్నారు.గ్రామంలోనికి రానీయకుండా తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని డిఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.