తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం మరోసారి గ్యాస్ లీకైంది.
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం మరోసారి గ్యాస్ లీకైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 28వ నంబరు బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో రోడ్లపైకి వచ్చి... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగి పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం కూడా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే.