ONGC Well
-
ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. గునిశెట్టివారిపుంతలోని ఓఎన్జీసీ 6వ నంబరు బావి వద్ద గ్యాస్ లీక్ కావడంతో ప్రజలు భయందోళనకు గురైయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్ లీకేజిని అదుపులోకి తీసుకువచ్చారు. తరచుగా గ్యాస్ లీకేజి కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. -
ఓఎన్జీసీ బావి నుంచి మరోసారి గ్యాస్ లీక్
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి ఆదివారం ఉదయం మరోసారి గ్యాస్ లీకైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 28వ నంబరు బావి నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో రోడ్లపైకి వచ్చి... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగి పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శనివారం కూడా గ్యాస్ లీకైన విషయం తెలిసిందే. -
ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజీ
సఖినేటిపల్లి: తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ లీకేజీ స్థానికులను ఆందోళనకు గురి చేసింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని ఓఎన్జీసీ నాలుగో నంబర్ బావి నుంచి గ్యాస్ లీకేజీ సంభవించింది. శనివారం ఉదయం బావి నుంచి గ్యాస్‌ను తీసుకెళ్లే పైప్‌లైన్‌కు చిన్న రంధ్రం పడడంతో గ్యాస్ పైకి ఎగచిమ్మింది. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఓఎన్జీసీ సిబ్బంది అరగంటలో ఆ లీకేజీని మూసేశారు. పైప్‌లైన్‌కు తుప్పుపట్టడంతోనే ఈ సమస్య ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇక్కడ మూడు పైప్లైన్లకు గాను రెండింటిని మార్చారు. మూడో లైన్‌కు కొత్త పైపులు వేయాల్సి ఉంది. -
ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీక్
రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో 33వ నంబరు బావితో పాటు కేశవదాసుపాలెం నుంచి గ్యాస్ లీక్ కావడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయంతో రోడ్లపైకి వచ్చి... ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు రంగంలోకి దిగి పొగలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
ఓఎన్జీసీ బావి నుంచి గ్యాస్ లీకేజి
హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ బావి నుంచి మళ్లీ గ్యాస్ లీకవుతోంది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద ఈ ఘటన జరిగింది. సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు.