తాడేపల్లిగూడెం : ‘అక్కయ్యగారూ. ఈ నెక్లెస్ ఎంత బాగుందో.. ధగధగా మెరిసిపోతోంది.. అచ్చం బంగారంలా లేదూ.. మీ మెడలో వేసుకుంటే అబ్బో ఇక చెప్పనక్కరలేదు.. పెళ్లిళ్లు, పేరంటాలకు వీటిని వేసుకెళితే అందరి దృష్టి మీపైనే’ అంటూ జిల్లాలోని డ్వాక్రా సంఘాల మహిళలే లక్ష్యంగా వన్‌గ్రామ్ గోల్డ్ నగల పేరిట కొన్ని ముఠాలు మోసం చేస్తున్నారుు. కొన్న రెండు మూడు రోజులకే వెలిసిపోతున్న గిల్టు నగల్ని అంటగట్టి లక్షలాది రూపాయలను దండుకుంటున్నారుు.
వన్‌గ్రామ్ గోల్డ్ నగలపై మోజు పెరగడంతో సామాన్యులతోపాటు సంపన్నులు సైతం వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యక్తులు డ్వాక్రా సంఘాలను లక్ష్యంగా చేసుకుని జిల్లాలో కొంతకాలంగా మోసం చేస్తున్నారు. ఆఫర్లతో మహిళలను బురిడీ కొట్టించడంతోపాటు వాటిని తెలిసిన వారికి అమ్మిపెడితే వెండి పట్టాల జతను నజరానాగా ఇస్తామని నమ్మబలుకుతున్నారు. దీంతో ఆ నగలను తాము కొనడంతోపాటు తమకు తెలిసిన వారితో కూడా మహిళలు కొనుగోలు చేరుుస్తున్నారు.
వీటిని కృష్ణాజిల్లా చిలకలపూడిలో తయూరు చేస్తున్నట్టు లేబుల్స్, జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో నగలను విక్రరుంచే దుకాణాల చిరునామాలతో బిల్లులు సృష్టించి రోల్డ్‌గోల్డ్ నగలను వన్‌గ్రామ్ గోల్డ్ నగలుగా విక్రరుస్తున్నారు. అవి రెండు మూడు రోజులకే రంగు వెలిసిపోతుండటంతో వాటిని కొన్న మహిళలు బిల్లులో పేర్కొన్న చిరునామాలకు వెళ్తున్నారు. ఆ చిరునామాలో ఇలాంటి నగలు విక్రయించే దుకాణాలు లేకపోవడంతో తెల్లమొహం వేస్తున్నారు.
జిల్లాలో ఈ తరహాలో వెరుు్యకి పైగా డ్వాక్రా సంఘాలకు వీటిని విక్రరుుంచినట్టు సమాచారం. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు చిరునామాలు ఇచ్చి, వాటి పేరుమీద రబ్బరు స్టాం పులు వేసిన ర శీదుల్ని ముఠా సభ్యులు మహిళలకు ఇస్తున్నారు. ఇలా ఒక్కొక్క సంఘం రూ.వెయ్యి నుంచి రూ.10 వేల వరకూ చేతి చమురు వదుల్చుకున్నట్టు తెలుస్తోంది.
ఎన్నెన్నో ఆఫర్లు
నెక్లెస్ రూ.300, గొలుసు రూ.500, డైమండ్ నెక్లెస్ రూ.వెరుు్య చొప్పున అమ్ముతున్నామని, ఆఫర్‌లో ఆ మూడిం టినీ రూ.900కే ఇస్తున్నామంటూ తాడేపల్లిగూడెం శివాలయం వీధిలోని మహిళా సంఘాలకు సురేష్ అనే యువకుడు రోల్డ్‌గోల్డ్ నగల్ని అంటగట్టాడు. రెండు రోజులకే అవి రంగు వెలిసి నల్లగా అవడంతో సంబంధిత మహిళలు ఆ యువకుడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. ఎన్నిసార్లు చేసినా ‘దిస్ నంబర్ నాట్ ఎగ్జిస్ట్స్’ అనే సమాధానం వస్తోంది.
మీరు కొన్న వస్తువులకు మూడేళ్ల వారంటీ అంటూ కార్డులు కూడా ఇచ్చారు. ఏ వస్తువుపై అరుునా 50 శాతం తగ్గింపు అంటూ ప్రచారం చేయడంతో డ్వాక్రా సంఘాల మహిళలు వన్‌గ్రామ్ వలలో చిక్కుకుంటున్నాయి. అసలు విషయం తెలిశాక లబోదిబో మంటున్నాయి. ఈ రాకెట్‌లో తాడేపల్లిగూడెంకు చెందిన వ్యక్తులు ఉన్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిల్లులపై నగల వ్యాపారానికి ల్యాండ్ మార్కుగా ఉన్న ప్రాంతాల పేరుతో స్టాంపులు వేస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది.
వన్ గ్రామ్ గోల్డ్ అంటే ...
నగల తయారీలో ఇది ఒక ఫార్ములా. ఇతర లోహాలతో తొలుత నగలు తయారు చేస్తారు. అనంతరం నగ ధగధగల కోసం పైపూతగా వేసి మెరుగు పెడతారు. ఇవి అధికంగా ముంబైలో తయారవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. వీటిధర నగను బట్టి రూ.వెరుు్య నుంచి రూ.4,500 వరకు ఉంటుంది. వీటి పేరు చెప్పి రోల్డ్‌గోల్డ్ నగలను మహిళలకు అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
సిసలైన వన్‌గ్రామ్ బంగారు ఆభరణాలను కరిగిస్తే చివరకు గ్రాము బంగారం వస్తుందని బంగారు వ్యాపారి ఒకరు తెలిపారు. ఇంత ధరకు అమ్మాల్సిన వన్‌గ్రామ్ నగలను అతి తక్కువ ధరకు విక్రయిస్తూ కొన్ని ముఠాలు మోసాలకు పాల్పడుతున్నారుు. మోసపోరుున మహిళలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మిన్నకుండిపోతున్నారు.
‘వన్‌గ్రామ్’ వల
Published Tue, Jul 22 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement