కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గూడవల్లికి చెందిన కందిపప్పు గణేష్ అనే విద్యార్థి ఉషారామా ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ సెకండియర్ చదువుతున్నాడు.
గురువారం ఉదయం అతడు కళాశాలకు వెళ్లేందుకు బస్సుకోసం ఎదురు చూస్తుండగా.. అటుగా వచ్చిన గన్నవరం మండలం జక్కులనెక్కలం గ్రామానికి చెందిన ఓ యువకుడి అటుగా బైక్‌పై వచ్చాడు. లిఫ్టు అడిగి గణేష్ అతని బైక్‌పై ఎక్కాడు. వారి బైక్ గన్నవరం ప్రధాన గేట్ వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న కారుని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న గణేష్ రోడ్డుపై పడిపోయాడు. ఆ వెనుకే వస్తున్న గన్నవరం డిపో బస్సు అతడిపైగా దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన గణేష్ అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ నడుపుతున్న యువకుడు గాయపడ్డాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉంది.