పోలవరం : యానాం-ఎదుర్లంక వారధిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... ముమ్మిడివరం మండలం చిప్పలపాలేనికి చెందిన సరిపెల్ల సత్యనారాయణరాజు(65) యానాం నుంచి ముమ్మిడివరం వైపు వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పాత ఇంజరం వీఆర్ ఓ రామకృష్ణ ఫిర్యాదు మేరకు ఎస్సై పాండుదొర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రికి తరలించార
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Sun, Oct 19 2014 11:51 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement