తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో ఓ గిరిజన యువకుడిని మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించుకుపోయారు.
ఎటపాక: తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం లక్ష్మీపురం గ్రామంలో ఓ గిరిజన యువకుడిని మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి అపహరించుకుపోయారు. సుమారు 100 మంది మావోయిస్టులు గ్రామానికి చేరుకుని పాస్టర్ కన్నయ్య కోసం ఆరా తీశారు. అతడు అందుబాటులో లేకపోవడంతో కన్నయ్య కుమారుడు ఊట్లే ఇస్సాక్ (18)ను తమ వెంట తీసుకుని వెళ్లారు. కన్నయ్య దొరికిన తర్వాత ఇస్సాక్‌ను విడిచిపెడతామని చెప్పినట్టు గ్రామస్తులు తెలిపారు.