
సాక్షి, తూర్పు గోదావరి : జిల్లాలోని కాట్రేనికొన మండలం ఉప్పూడి వద్ద ఓఎన్జీసీ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కలకలం రేపుతోంది. పంటల పొలాల మధ్యగా వెలుతున్న పైప్‌లైన్ లీకైంది. భారీగా గ్యాస్ లీకవుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు.. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముందుజాగ్రత్తగా సమీపంలోని ప్రజలకు ఖాళీ చేయిస్తున్నారు. గ్యాస్ లీకేజీని కంట్రోల్ చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది ఘటన స్థలానికి పరికరాలను తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment