
చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి: శత్రుచర్ల
హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడేదే అని తాజా మాజీ మంత్రి, పాతపట్నం ఎమ్మెల్యే శత్రుచర్ల విజయరామ రాజు తెలిపారు. సీమాంధ్రలో కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధి అంతా చంద్రబాబు వల్లే సాథ్యమని ఆయన స్సష్టం చేశారు.
ఆదివారం హైదరాబాద్లో శుత్రచర్ల విజయరామరాజు,ఆయన మేనల్లుడు, కురుపాం ఎమ్మెల్యే జనార్దన్ థాట్రాజ్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.అనంతరం శత్రుచర్ల విలేకర్లతోపై విధంగా మాట్లాడారు.అయితే చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని జనార్దన్ థాట్రాజ్ స్పష్టం చేశారు.ఎటువంటి షరతులు లేకుండా తెలుగుదేశంలో చేరుతున్నట్లు వారు ఈ సందర్బంగా తెలిపారు.