ధర్మపురి మండలం గాదెపల్లి పంచాయతీ పరిధిలోని గంగసముద్రం, సిర్‌పూర్‌నూత్‌పల్లి గ్రామాల్లో 200 మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి.
ధర్మపురి, న్యూస్‌లైన్: ధర్మపురి మండలం గాదెపల్లి పంచాయతీ పరిధిలోని గంగసముద్రం, సిర్‌పూర్‌నూత్‌పల్లి గ్రామాల్లో 200 మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ బాధితులు తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. 35 ఏళ్ల క్రితం ఎస్సారెస్సీ వరద కాలువ కింద ముంపునకు గురైన వివిధ గ్రామాల నుంచి వీరిక్కడికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నారు.
ఈ రెండు గ్రామాలకు చెందిన భూములు సారంగపూర్ మండల పరిధిలో ఉండగా, పంచాయతీ మాత్రం ధర్మపురి మండలంలో ఉంది. దీంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది చాలన్నదట్టు గ్రామస్తులకు ఉన్న ఓట్లను అధికారులు తొలగించేశారు. తమను సారంగాపూర్ మండలంలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ధర్మపురి మండలంలోనే కొనసాగించాలని, తొలగించిన తమ ఓట్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.