dharma puri
-
ఇక.. ధర్మపురి నగరపంచాయతీ!
ధర్మపురి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న నగరపంచాయతీల్లో ధర్మపురికి చోటు దక్కనుంది. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా రెండు నెలల క్రితం నూతన పంచాయతీలు, నగరపంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. ఈమేరకు జగిత్యాల జిల్లా నుంచి మేజర్ పంచాయతీలైన ధర్మపురి, రాయికల్‌ను నగరపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. నిబంధనలు అనుకూలం గతంలో నగరపంచాయతీ హోదా దక్కాలంటే 20వేల జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 20 వేలు ఉన్న జనాభాను 15 వేలకు కుదించింది. పంచాయతీలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనుబంధ గ్రామాలను విలీనం చేసి నగరపంచాయతీలుగా మార్చనుంది. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మొదట 16,690 జనాభా ఉండగా సమీపంలోని కొరండ్లపల్లి, హరన్నపల్లి గ్రామాల విలీనంతో ధర్మపురి జనాభా 17,352కు చేరింది. రాయికల్ పంచాయతీలో గ్రామాల విలీనం ప్రతిపాదించకపోవడంతో జనాభా 16,985 ఉంది. ధర్మపురి, రాయికల్ పంచాయతీల్లో సంవత్సర ఆదాయం రూ.70లక్షలకు పైగా ఉంది. అన్ని అర్హతలున్న రెండు పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చడానికి కలెక్టర్ శరత్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. -
బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత
ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్లో జరిగే వివాహానికి వెళ్తున్నారు. స్తంభంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట్ మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన వెగ్గడి శ్రీధర్(19), కొత్తూర్ గ్రామానికి చెందిన మోటపల్కుల ప్రవీణ్(14), మండ అశోక్ (20) లుగా గుర్తించారు. లారీని ఓవర్టేక్ చేయబోయే యత్నంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వీరి బైక్ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భద్రత డొల్ల..
అధికారుల నిర్లక్ష్యం.. విధుల్లో నిర్లిప్తత విలువ.. అక్షరాల అరకోటి పైమాటే. రైతుల సొమ్మును భద్రంగా ఉంచాల్సిన ఉద్యోగులు గాలికొదిలేశారు. కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంతో దొంగలు వచ్చి తాపీగా ఉన్నదంతా ఊడ్చేశారు. వారు ఇంటి దొంగలా? బయట దొంగలా? అనేది విచారణలో తేలనుంది. కాటారం దక్కన్ గ్రామీణ బ్యాంకులో బంగారం మాయం ఘటన మరవకముందే ధర్మపురి ప్రాథమిక సహకార సంఘంలో చోరీ జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. - న్యూస్‌లైన్, ధర్మపురి ధర్మపురి న్యూస్‌లైన్ : ధర్మపురి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో భద్రత ఏర్పాట్లు లేకనే దొంగలు చొరబడ్డారని తేలిపోయింది. పట్టణంలోని నం బరు 63 జాతీయ రహదారిపై నిత్యం వాహనా లు రాకపోకలు సాగుతుంటాయి. సంఘానికి కేవలం 50మీటర్ల దూరంలోనే తహశీల్దార్, మండల పరిషత్ తదితర ప్రభుత్వ కార్యాలయా లు ఉన్నాయి. జనసంచారం అధికంగా ఉంటుం ది. అయినా వీటి సమీపంలోని పీఏసీఎస్‌లో చోరీ జరగడం గమనార్హం. నగదుతోపాటు రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భద్రపర్చే సింగిల్ విండోలో భద్రతా పరమైన ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. కనీసం సీసీ కెమెరాలు బిగించలేదు. వాచ్‌మన్ సైతం లేడు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపడుతోంది. షట్టర్లు పగులగొట్టి.. లాకర్లు తెరచి.. ముందుగా పీఏసీఎస్ షట్టర్ల తాళాలను వేటకొడవలితో కోసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గదిలో ఓ మూలకు పడిఉన్న వేటకొడవలి ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. షట్టర్లు తెరిచిన దొంగలు.. నేరుగా లోనికి ప్రవేశించారు. ఆ తర్వాత తాళాలతో లాకర్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమయంలో దొంగలు మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. పీఏసీఎస్‌లో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. రెండు లాకర్లు, నాలుగు బీరువాలు ఉన్నాయి. ఒక లాకరులో ఆభరణాలు, మరోదానిలో నగదు భద్రపరుస్తున్నారు. వాటికి సంబంధించిన తాళం చెవులు మేనేజరు వద్ద ఉండాలి. మేనేజర్ బుచ్చన్న మంగళవారం ఆఫీస్ పనిపై కరీంనగర్ వెళ్లగా మిగతా వారు విధుల్లో ఉన్నారు. తాళం చెవులను బీరువాలోని రహస్య లాకర్లో పెట్టి విధులు ముగించుకుని ఎవరి ఇళ్లకు వారు వెళ్లారు. వీటిని చూసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళాలతో నేరుగా బీరువా తెరిచి అందులోని లాకర్ తాళాలు తీసుకుని లాకర్ తెరిచి ఆభరణాలు ఎత్తుకెళ్లారంటే బాగా తెలిసిన వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. రూ.50 లక్షల వరకు చోరీ పీఏసీఎస్‌లో రూ.50 లక్షల విలువైన బంగారం(1345.42 గ్రాములు), రూ.2.85 లక్షలు నగదు అపహరణకు గురైందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ధర్మపురి సింగిల్‌విండో పరిధిలో 16 గ్రామాలకు చెందిన 27మంది బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టారు. సుమారు రూ.25 లక్షల రుణాలు పొందారు. తాకట్టు పెట్టిన ఆభరణాలపై యాభై శాతం వరకు రుణం అందిస్తారు. ఈ లెక్కన ఆభరణాల అసలు విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని అంచనా. విండోపై ఎంతో నమ్మకంతో విలువైన ఆభరణాలు కుదవపెట్టిన వారికి ఈ సంఘటనతో ఆందోళన మొదలైంది. దొంగలను పట్టుకుంటాం పీఏసీఎస్‌లో చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకుంటామని సీఐ మహేందర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌తో కలిసి పరిశీలించారు. ఎస్సై జగన్మోహన్ ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. కరీంనగర్ నుంచి క్లూస్ టీంను రప్పించారు. జాగిలాలతోనూ పరిశీలించారు. సంఘటనా స్థలం నుంచి స్థానిక ఆర్అండ్ బీ వసతి గృహం వరకు వెళ్లిన జాగిలం.. దర్గా వద్దకు వెళ్లే రహదారి వద్ద ఆగిపోయింది. కాగా, వేలిముద్ర నిపుణులు.. అనుమానితులతో పాటు సిబ్బంది వేలిముద్రల్ని సేకరించారు. -
మా ఓట్లు తీసేసిన్రు
ధర్మపురి, న్యూస్‌లైన్: ధర్మపురి మండలం గాదెపల్లి పంచాయతీ పరిధిలోని గంగసముద్రం, సిర్‌పూర్‌నూత్‌పల్లి గ్రామాల్లో 200 మంది పేర్లు ఓటరు జాబితాలో గల్లంతయ్యాయి. దీంతో తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ బాధితులు తహశీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేశారు. 35 ఏళ్ల క్రితం ఎస్సారెస్సీ వరద కాలువ కింద ముంపునకు గురైన వివిధ గ్రామాల నుంచి వీరిక్కడికి వచ్చి నివాసం ఏర్పర్చుకున్నారు. ఈ రెండు గ్రామాలకు చెందిన భూములు సారంగపూర్ మండల పరిధిలో ఉండగా, పంచాయతీ మాత్రం ధర్మపురి మండలంలో ఉంది. దీంతో ఇప్పటికే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇది చాలన్నదట్టు గ్రామస్తులకు ఉన్న ఓట్లను అధికారులు తొలగించేశారు. తమను సారంగాపూర్ మండలంలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ధర్మపురి మండలంలోనే కొనసాగించాలని, తొలగించిన తమ ఓట్లను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.