రాజకీయాలకు అతీతంగా పైడితల్లి జాతర
విజయనగరం క్రైం: గత పాలకుల మాదిరిగా కాకుండా ఈ ఏడాది పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా.. సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తెలిపారు. సోమవారం ఆయన పైడితల్లి అమ్మవారి తోలేళ్ల ఉత్సవంలో భాగంగా ఆలయ ధర్మకర్తగా అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 300 ఏళ్లుగా పైడితల్లమ్మ పండగ ప్రశాంతంగా జరిగిందన్నారు.
కానీ గత ఏడాది మాత్ర ం పండగను కర్ఫ్యూ నీడలో చేసుకోవాల్సి వచ్చిందన్నారు. గత పాలకులు సాంప్రదాయాలను పక్కన పెట్టి జాతర నిర్వహించారని చెప్పారు. వారు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే సంతోషిస్తామన్నారు. ఈసారి భక్తులు స్వేచ్ఛగా అమ్మవారిని దర్శించుకు నేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో బతుకమ్మ పండగను రాష్ట్ర పండగగా గుర్తించి నిర్వహిస్తున్నారని, పైడితల్ల మ్మ పండగను కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని విలేకరులు అడగ్గా పైడితల్లమ్మ పండగకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారన్నారు. భక్తుల శ్రేయస్సే తప్ప అది రాష్ట్రవ్యాప్త పండగ, జిల్లా వ్యాప్త పండగ అన్నది ముఖ్యం కాదని తెలిపారు. ఆయనతో పాటు అశోక్ సతీమణి సుశీలా గజపతిరాజు, జెడ్పీ చైర్‌పర్సన్ శోభ స్వాతిరాణి, ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, తదితరులు ఉన్నారు.