అమ్మ సంబరానికి సర్వం సిద్ధం | Paiditalli Jatara In Vizianagaram | Sakshi
Sakshi News home page

అమ్మ సంబరానికి సర్వం సిద్ధం

Published Tue, Oct 7 2014 2:06 AM | Last Updated on Mon, Aug 20 2018 5:08 PM

అమ్మ సంబరానికి సర్వం సిద్ధం - Sakshi

అమ్మ సంబరానికి సర్వం సిద్ధం

 క్షణాలు యుగాలుగా, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుదినం రానే వచ్చింది.... తన పిల్లల మొర ఆలకించేందుకు అమ్మే ప్రత్యేక రథంపై భక్తుల సమక్షంలోకి వచ్చే వేళ ఆసన్నమైంది.... మరి కొద్ది గంటల్లో ఆ మహద్భాగ్యం కలగనుంది....  పూజారి రూపంలో ఆ అమృతవల్లి దర్శనమివ్వనున్న అరుదైన ఘట్టం ఆవిష్కృతం కానుంది....అమ్మ ఉత్సవంలో పాల్గొని అలౌకికానందంలో తేలియాడేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. ఇప్పటికే పట్టణం కోలాహలంగా మారింది... జాతరను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది....
 
 విజయనగరం మున్సిపాలిటీ/ కల్చరల్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన పైడితల్లి అమ్మవారి ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. అన్ని శాఖల సమన్వయంతో ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఎవరికి అప్పగించిన బాధ్యతలను వారు నెరవేరుస్తూ   భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నా రు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు  పూజారి తాళ్లపూడి భాస్కరరావు సిరిమానుపై అధిరోహించడంతో ఉత్సవం ప్రారంభంకానుంది. అం తకుముందు పట్టణంలోని హుకుంపేటలో ఉండే పూజారి భాస్కరరావు ఇంటి వద్ద నుంచి సుమారు  12 గంటల సమయంలో సిరిమాను రథం, పూజా రి భాస్కరరావులను మూడు లాంతర్ల వద్ద గల చదురుగుడి ఆలయం వద్దకు చేర్చుతారు.
 
 సిరిమా ను రథం హుకుంపేట నుంచి నేరుగా ఉల్లివీధి, కన్యకాపరమేశ్వరి దేవాలయం మెయిన్ రోడ్డు, గంట స్తంభం మీదుగా ఆలయాన్ని చేరుతుంది.   అక్కడ సంప్రదాయబద్ధంగా సిరిమానుకు, అమ్మవారి ప్రతిరూపమైన పూజారికి  పూజలను నిర్వహిస్తారు. ఆ తరువాత  సిరిమానుపై పూజారి భాస్కరరావు అధిరోహిస్తారు. దేవాలయం నుంచి అమ్మవారి పుట్టిళ్లు అయిన కోట వరకూ సిరిమాను  మూడు సార్లు తిరగడంతో ఉత్సవం ముగిసినట్లు అవుతుంది. గత ఏడాది గంటన్నర ఆలస్యంగా సిరిమానోత్సవం  ప్రారంభమైంది. ఈ సారి అటువంటి సమస్య లేకుండా ఎట్టి పరిస్థితిల్లో ముహూర్తం సమయానికి సిరిమానోత్సవాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. పూజారి తాళ్లపూడి  భాస్కరరా వు సిరిమానును అధిరోహించడం ఇది ఆరోసారి.
 
 నయన మనోహరంగా....
 ఈ ఉత్సవానికి తిలకించడానికి విజయనగరంతో పాటు శ్రీకాకుళం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఒడిశా, చత్తీస్‌ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవాలు సందర్భంగా మున్సిపల్, దేవాదాయశాఖాధికారులు పట్టణమంతా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. రంగురంగుల తోరణాలతో ఆకర్షణీయంగా  అలంకరించారు. పట్టణంలో ప్రముఖ ప్రాంతాలమైన కోట, గంట స్తంభంతో పాటు పట్టణంలో ముఖ్య కూడళ్లల్లో ఉన్న విగ్రహాలను  విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సిరి మాను దేవాలయం నుంచి కోట వరకూ మూడు సార్లు తిరగేటప్పుడు భక్తులు వీక్షించేందుకు ఎక్కడక్కడ బారికేడ్లును ఏర్పాటు చేశారు. సిరిమాను తిరి గే ప్రధాన రహదారులను మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట  నుంచి మూసివేస్తారు.
 
 భారీ బందోబస్తు  
 సిరిమానోత్సవానికి సంబంధించి అన్ని శాఖలు ఏర్పాట్లును పూర్తి చేశాయి. దేవాదాయశాఖ, ము న్సిపల్,  పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా   ఏర్పాట్లును చేశాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బం దులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బందోబస్తును ఈ ఏడాది ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే  భక్తులు అధికంగా వస్తారని భావిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ ఏడాది కొత్తగా వివిధ బృందాలను ఏర్పాటు చేసి, వాటికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. దొంగతనాల నివారణతో పాటు  ట్రాఫిక్, సిరిమాను వద్ద రోప్ పార్టీ, పాత నేరస్తుల కదలికలు కోసం 1500 మంది సిబ్బందిని కేటాయించారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రావాల్  ఆధ్వర్యంలో ఏడుగురు డీఎస్పీలు, 32 మంది సీఐలు, 169 మంది ఎస్‌ఐలు, 713 మంది కానిస్టేబుళ్లు, 38 మంది మహిళా  కానిస్టేబుళ్లుతో పాటు స్పెషల్‌పార్టీలు, ఇతర జిల్లాలకు చెందిన సిబ్బందిని వినియోగిస్తున్నారు. దేవాలయం వద్ద వీఐపీ క్యూలో రాజ కీయ ఒత్తిడిలతో పాటు ఇతరత్రా జోక్యాలు పెరగకుండా నివారించేందుకు ఇతర జిల్లాల నుంచి తీసుకువచ్చిన పోలీసు అధికారులను దేవాలయాలు వద్ద నియమించారు. ఇక విద్యుత్ కోత లేకుండా అధికారులు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. విజయనగరం పట్టణానికి నీరందించే ముషిడిపల్లి, నెల్లిమర్ల పంపింగ్ హౌస్‌లకు డెరైక్ట్ లైనులో విద్యుతను అం దించేందుకు ఆ శాఖ సీఎండీ అనుమతి ఇచ్చారు.  
 
 600 మంది పారిశుద్ధ్య కార్మికులు
 పట్టణంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా నిరంతరం గా పనిచేసుందుకు 600 మంది పారిశుద్ధ్య కార్మికులను మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేశారు.  అలాగే పట్టణంలో 30 ప్రదేశాల్లో  మూత్ర విసర్జన శాలలను ఏర్పాటు చేశారు. అలాగే 12 ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
 150  ప్రత్యేక బస్సులు
 వివిధ ప్రాంతాల నుంచి భక్తులను విజయనగరం తీసుకురావడానికి ఎపీఎస్ ఆర్టీసీ ఈ ఏడాది 150 బస్సులను నడుపుతోంది. విజయనగరం, శ్రీకాకు ళం జిల్లాలోని పాలకొండ, శ్రీకాకుళం, రాజాం, పార్వతీపురం, సాలూరు, విజయనగరం, ఎస్‌కోట డిపోలకు చెందిన బస్సులను కేటాయించారు.
 
 కంట్రోలు రూమ్‌లు... వైద్య శిబిరాల  ఏర్పాటు
 దేవాదాయ, మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖలు కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేశా యి. మూడు లాంతర్ల వద్ద దేవాలయానికి ఎదురుగా వీటిని ఏర్పాటు చేశారు. దేవాలయం సమీపంలో అగ్నిమాపక శకటాన్ని  అందుబాటులో ఉం చారు. అలాగే ఆర్టీసీ కాంప్లెక్సు, ఇతర ప్రదేశాల్లో 108,104 వాహనాలను  ఉంచారు. భక్తులకు అత్యవసర పరిస్థితులు వస్తే వైద్య సహాయం అందించేందుకు ఘోషా, కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యులను నియమించారు. అమ్మవారి దేవాలయం ఎదురుగా వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో 24 గంటలూ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయగా, జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గుమ్చి,  ఆర్టీసీకాంప్లెక్పు,  రైల్వే స్టేషను, గురజాడ అప్పారావు విగ్రహ సర్కిల్, అంబటి సత్రం జంక్షను, సిటీ బస్టాండుల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement