విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్: రైతు సుఖంగా ఉంటేనే దేశంలో ప్రజల ంతా సంతోషంగా ఉంటారని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. గుంటూరు లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో నెల 18 నుంచి ప్రాంభించనున్న జాతీయ రైతు సమ్మేళనం కార్యక్రమానికి అనుబంధంగా రైతు జీవన చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ వ్యవసాయరంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. జాతీయ వ్యవసాయ విధానం అమలు చేస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే చేపట్టిన జాతీయ రైతు సమ్మేళనం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టాల పాలవుతున్నారని చెప్పారు. లాభసాటి వ్యవసాయం చేసేందుకు ఈనెల 18, 19, 20 తేదీల్లో గుంటూరులో జాతీయ రైతు సమ్మేళనాన్ని నిర్వహించనున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు రైతుల జీవన విధాన చిత్రలేఖన పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ పాఠశాలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రవీంద్ర, అయ్యస్వామి, సుబ్బారావు, కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ కన్నా మాస్టారు తదితరులు పాల్గొన్నారు.
రైతు క్షేమమే దేశ క్షేమం
Published Mon, Dec 16 2013 1:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement