హోదా ఉద్యమంపై మళ్లీ పవన్ ట్వీట్లు | pawan kalyan asks government to permit vizag protest | Sakshi
Sakshi News home page

హోదా ఉద్యమంపై మళ్లీ పవన్ ట్వీట్లు

Published Tue, Jan 24 2017 6:41 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదా ఉద్యమంపై మళ్లీ పవన్ ట్వీట్లు - Sakshi

హోదా ఉద్యమంపై మళ్లీ పవన్ ట్వీట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ యువత తలపెట్టిన శాంతియుత నిరసనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినీనటుడు పవన్ కల్యాణ్ కోరారు. సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే నిరసనలకు అనుమతి ఉండబోదని ఏపీ డీజీపీ, విశాఖ కలెక్టర్, పోలీసు కమిషనర్ తదితరులు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో పవన్ మరోసారి ట్విట్టర్ ద్వారా స్పందించారు. 
 
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను ఎవరూ కాదనలేరని ఆయన చెప్పారు. యువకులు చేపట్టిన నిరసనకు రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పించుకున్నప్పుడు నిరసన తెలియజేసే హక్కు పౌరులకు ఉంటుందని ఆయన తెలిపారు. ఇప్పుడు ఈ నిరసనకు అనుమతి ఇవ్వకపోతే.. వాళ్లలో అశాంతి కలగజేసినట్లు అవుతుందని, శాంతియుత నిరసన వాళ్ల హక్కని పవన్ ట్వీట్ చేశారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement