పవన్.. రాజధాని అన్యాయంపై స్పందించండి | pawan kalyan fight for fomers | Sakshi
Sakshi News home page

పవన్.. రాజధాని అన్యాయంపై స్పందించండి

Published Wed, Feb 4 2015 3:36 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

pawan kalyan fight for fomers

జనసేన అధ్యక్షుడికి రైతుల వినతి
 సాక్షి, హైదరాబాద్: ఏటా మూడు పంటలు పండే తమ విలువైన భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంటోందని, దీనిపై స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు కొందరు ఇటీవల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసి విన్నవించారు.
 
 భూములు ఇవ్వబోమన్న రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని వివరించారు. గత సాధారణ ఎన్నికల్లో మీరు చెప్పిన మేరకు టీడీపీ, బీజేపీలకు ఓటు వేశామని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పెడుతున్న ఇబ్బందులపై స్పందించాలని కోరారు. అన్యాయం ఎక్కడ, ఎప్పుడు జరిగినా ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఇంతమంది ప్రజలు, రైతులు, కూలీలకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించక పోవటం మంచిది కాదని రైతులు అన్నారు. వారు చెప్పినందంతా విన్న పవన్.. రాజకీయాల గురించి 2017 వరకు మాట్లాడనని, అయితే ప్రజల ఇబ్బందులపై సరైన సమయంలో స్పందిస్తానన్నారు. పవన్‌ను కలిసిన వారిలో యర్రబాలెం, ఉండవల్లి గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు ఉన్నారు. కాగా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పవన్ ప్రాంతాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement