రాజాం రూరల్: పింఛన్ క్రమబద్ధీకరణ, అనర్హుల పేరిట తొలగింపు ప్రక్రియ ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకుంది. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన వృద్ధురాలు గంగు సత్తెమ్మ పింఛన్ జాబితాలో తన పేరు లేదని తెలుసుకొని ఆందోళనకు గురై గురువారం సాయంత్రం గుండెపోటుతో మరణించింది. ఈ సంఘటన జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. సత్తెమ్మకు ఐదు సంవత్సరాలుగా వృద్ధాప్య పింఛను రూ.200 వంతున వస్తోంది. పింఛను మంజూరైన నాటికే ఆమె వయస్సును 65 ఏళ్లుగా అధికారులు నిర్ధారించారు. అరుుతే ఇటీవల సర్వే సమయంలో రేషన్ కార్డు ఆధారంగా 65 ఏళ్లు నిండలేదంటూ అధికారులు తేల్చారు.
ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీన పెనుబాకలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం నిర్వహించినప్పుడు సత్తెమ్మ పింఛను తీసుకొనేందుకు ఆశగా వచ్చింది. కాని ఆ రోజు కొద్ది పింఛన్లు మాత్రమే పంపిణీ చేసి మిగిలినవి తర్వాత ఇస్తామని ప్రకటించడంతో తన పింఛను ఎక్కడికి పోతుందిలే అనుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. తాజాగా గురువారం మిగిలిన వారికి పింఛన్ సొమ్ము పంపింఈ చేస్తున్నారని తెలుసుకొని వెళ్లిన సత్తెమ్మకు తన పింఛన్ రద్దయిందని తెలుసుకొని బెంగడిల్లిపోయింది. ప్రభుత్వం ఇటీవల వృద్ధులకు పెంచిన వెరుు్య రూపాయల పింఛన్ తనకు రాదేమోనని అనుకుంటూనే ఇంటికి చేరుకున్న సత్తెమ్మ కొద్ది గంటల వ్యవధిలోనే గుండెపోటుకు గురై సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్రాణాలు విడిచింది.
అధికారులు ఈమె వయస్సును రేషన్‌కార్డు ప్రకారం 64 సంవత్సరాల 7 నెలలు ఉందని, 65 సంవత్సరాలకు ఐదు నెలలు తక్కువగా వయస్సు ఉండడంతో తాము పింఛను మంజూరు చేయలేమని స్పష్టం చేయడంతో ఆ వృద్ధురాలి హృదయం గాయపడింది. దీంతోనే మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రావాల్సిన రూ.1000 పింఛను కూడా నిలిచిపోతుందని తెలిసి ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెబుతూ రోదించార. పేర్కొన్నారు.
నిరుపేద కుటుంబంలో పెను విషాదం
పింఛను తమ కుటుంబంలోని అతి ముఖ్యమైన వ్యక్తిని ప్రాణాలు పోయేటట్టు చేయడంతో సత్తెమ్మ కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతే లేకుండాపోయింది. సత్తెమ్మ భర్త సన్యాసి ఓ రైస్‌మిల్లులో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కుమారుడు మోహనరావు పెళ్లి చేసుకొని వేరే కాపురం పెట్టాడు. దీంతో పెనుబాకలో వృద్ధ దంపతులిద్దరే నివాసముంటున్నారు. వృద్ధాప్యంలోనూ హాయిగా వెళ్లిపోతున్న వీరి జీవితంలో పింఛను క్రమబద్ధీకరణ పెను చిచ్చుపెట్టినట్టయింది. రూ. వెయ్యి పింఛను మాటేమిటో గాని తన భార్య నిండు ప్రాణం పోయిందని సన్యాసి రోదిస్తూ చెప్పాడు.
జాగ్రత్తగా క్రమబద్ధీకరించి ఉంటే...
సత్తెమ్మ వయస్సు నిర్ధారణకు సంబంధించి అధికారులు, పింఛన్ల కమిటీ కాస్త అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఆమె ప్రాణాలు పోయి ఉండేవి కావ ని పలువురు విశ్లేషిస్తున్నారు. ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛను వస్తున్న నేపధ్యం లో కాస్త లోతుగా అధ్యయనం చేసి ఉంటే కేవలం రేషన్ కార్డు మాత్రమే ప్రా మాణికంగా తీసుకోకుండా ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు కూడా పరిశీలించి తగిన విచారణ చేపడితే ఆమెకు పింఛను వచ్చేదని చెబుతున్నారు. కాగా సత్తెమ్మ పింఛన్ కోల్పోవడానికి రాజకీ య కారణాలున్నట్టు తెలిసింది. ఈమె కుటుంబం వైఎస్‌ఆర్ సీపీ కి అనుకూలంగా ఉండడం, సర్పంచ్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో జాబితా నుంచి సత్తెమ్మ పేరును తొలగించినట్టు విమర్శలు వస్తున్నాయి.
పింఛన్ పోయింది..గుండె ఆగింది!
Published Fri, Oct 10 2014 1:52 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement