
కేంద్ర మంత్రి పురంధేశ్వరికి చేదు అనుభవం
విశాఖపట్నం: కేంద్రమంత్రి పురంధేశ్వరికి విశాఖపట్నంలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె పాల్గొన్న దక్షిణ నియోజకవర్గం రచ్చబండ రసాభాసగా మారింది. ఇందిరానగర్ కాలనీ వాసులు పురందేశ్వరి తీరుపై మండిపడ్డారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాలనీవాసులపై కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. జనం పోలీసుల్ని ప్రతిఘటించి బారికేడ్లు తోసుకుంటూ వచ్చారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.