
వామ్మో.. కుక్కంటే హడల్
కుక్కలంటే కొంతమంది సరదా పడతారు, మరికొంతమంది భయపడతారు. వీధికుక్కలంటే మాత్రం అందరూ ఎంతోకొంత దూరంగానే ఉంటారు. అనంతపురం జిల్లాలోని ఈ కుక్క అంటే మాత్రం భయం కాదు.. ఏకంగా జనమంతా హడలెత్తిపోతున్నారు. ఎందుకంటారా? దానికి వేరే పనంటూ ఏమీ లేదు. కేవలం కరవడమే పనిగా పెట్టుకుంది. ఎందుకో ఏంటో చూడండి..
అనంతపురం జిల్లా గోరంట్ల పట్టణ ప్రజలు కుక్క దెబ్బకు హడలెత్తిపోతున్నారు. ఏకంగా 76 మందిని కరవడంతో ప్రజలు బెంబేతెత్తిపోయారు. ఈ విషయం గురించి పంచాయితీ సిబ్బందికి చెప్పినా సకాలంలో స్పందిచలేదని బాధితులు వాపోయారు. దీనికి తోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్లు కూడా తగినన్ని అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందిపడ్డారు.