చంద్రబాబు నిలువునా ముంచేశారు | people fire on chandra babu govt | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నిలువునా ముంచేశారు

Published Sun, Dec 14 2014 2:32 AM | Last Updated on Mon, Oct 1 2018 4:52 PM

‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం.

రుణమాఫీ పేరుతో మోసం చేశారు
రైతు సాధికార సదస్సుల్లో అధికారులను అడ్డుకున్న రైతులు
సమాధానం దాటవేసిన అధికారులు


కుప్పం: ‘కరువు పరిస్థితుల్లో బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు రుణం మాఫీ చేయకుండా కనీసం దాని వడ్డీకి సరిపడా డబ్బు కూడా ఇవ్వకుండా పత్రాలు తెచ్చి చేతిలో పెడుతున్నారు. అవి మాకు అవసరం లేదు మీ దగ్గరే పెట్టుకోండి’ అంటూ కుప్పం వుండల పరిధిలోని రైతులు అధికారులపై మండిపడ్డారు. చెక్కునత్తం, వుంకలదొడ్డి, ిపీబీనత్తం, అనిమిగానిపల్లి, వెండుగంపల్లి, గోనుగూరు గ్రామ పంచాయతీల్లో శనివారం నిర్వహించిన రైతు సాధికార సదస్సుల్లో ఈ మేరకు అధికారులను నిలదీశారు.

అనిమిగానిపల్లి గ్రామ సభలో సర్పంచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంకుల్లో ఉన్న రుణాలు చెల్లించొద్దని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. ప్రభుత్వం భిక్షమేసినట్టు రూ.500, రూ.1000 బ్యాంకులో వేస్తున్నారు. ఇది ఏ మూలకూ సరిపోదు. ఇదేనా రుణమాఫీ అంటే అని అధికారులను నిలదీశారు. రెండో విడతలో న్యాయం చేస్తామని ఎంపీడీవో వివరణ ఇస్తున్నా వారు పట్టించుకోలేదు. రుణం మాఫీ చేయని, సమాధానం చెప్పని ఇలాంటి సదస్సులు వద్దని రైతులు వెళ్లిపోయారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement