
సాక్షి, అమరావతి : రాష్ట్రానికి రెవెన్యూ తీసుకొచ్చే శాఖల్లో రవాణా శాఖ నాల్గో స్థానంలో ఉందని.. ఆర్టీసీ బస్టాండ్‌లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వ్రికయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది రవాణా శాఖ నుంచి నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
పైస్థాయి నుంచి అవినీతి నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. రవాణా శాఖలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు నాలుగు వేల బస్సుల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేశామని తెలిపారు. సచివాలయంలో త్వరలో ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment