
చిప్స్‌లో ఫార్మసీ వారోత్సవాలు
విద్యానగర్: గుంటూరు రూరల్ మండలం చౌడవరం గ్రామంలోని చిప్స్ ఫార్మసీ కళాశాలలో జాతీయ ఫార్మశీ వారోత్సవాలలో బాగంగా శుక్రవారం ఆటలపోటీలు నిర్వహించారు. కార్యక్రమాలకు ప్రిన్సిపాల్ డాక్టర్ సూర్యదేవర విద్యాధర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఎన్‌యూ రెక్టార్ కేఆర్‌ఎస్ సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ప్రపంచ ఫార్మా రంగంలో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సమాజంలో ఫార్మసిస్ట్ ప్రాముఖ్యత చాటాలన్నారు.
కళాశాల అధ్యక్షుడు డాక్టర్ బసవపున్నయ్య మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనిటీ ఫార్మసిస్ట్‌గా సమాజానికి సేవ చేయాలని కోరారు. అనంతరం కళాశాల కార్యదర్శి మద్దినేని గోపాల కృష్ణ, అదనపు కార్యదర్శి మాదాల రమేష్ మాట్లాడారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఆటల పోటీలలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెం దిన 15 ఫార్మశీ కళాశాలల విద్యార్థులు 600 మంది పాల్గొన్నారు. క్రీడల్లో విజేతలకు శనివారం జరగనున్న ముగిం పు ఉత్సవాలలో బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.