కేసీఆర్ 'ప్రమాణ' ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ప్రమాణస్వీకారం, అవిర్భావ సభ ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ కార్యదర్శి పీకే మహంతి సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జూన్ 2 తేదిన ఉదయం 8:15గంటలకు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆతర్వాత పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ సభ లో కేసీఆర్ పాల్గొంటారు. రాజభవన్ లో జరిగే ప్రమాణ స్వీకారం, పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ ఏర్పాట్లు, భద్రతపై ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు చర్చించారు.