విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విమానాశ్రయంలో చిరుజల్లులు...ఆటగాళ్ళు వస్తారా రారో...ఈ వానకు మ్యాచ్‌కు ఏమవుతుందో...! అని అభిమానుల్లో సందేహాలు..! వాటిని పటాపంచలు చేస్తూ స్పైస్ జెట్ విమానం భారత, విండీస్ ఆటగాళ్లతో శుక్రవారం మధ్యాహ్నం విశాఖలో వాలింది. నేరుగా కొచ్చి నుంచి ఈ విమానం విశాఖకు వచ్చింది. విశాఖలోనే 2011లో సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన విరాట్‌కోహ్లి, అజేయంగా 90 పరుగులు చేసిన విశాఖ కుర్రాడు రోహిత్‌శర్మ ద్వయం విశాఖ అభిమానులను ఊర్రూతలూగించారు.
ఇది గతమైతే గురువారం జరిగిన సీరిస్‌లోని తొలిమ్యాచ్‌లోనూ ఈ జోడి వండర్ చేసింది. అదే ఊపుమీద విశాఖలో అడుగుపెట్టిన తమ అభిమాన క్రీడాకారులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు అభిమానులు. మరోమారు హెలికాఫ్టర్‌షాట్‌ను ప్రత్యక్షంగా ప్రదర్శించేందుకు కూల్ ధోనీ వచ్చాడు. ఇక తొలి మ్యాచ్‌లో బంతితో రాణించిన బ్యాట్స్‌మెన్ సురేష్‌రైనా, ఓపెనర్ ధావన్, స్పిన్నర్లు రవీంద్ర, అశ్విన్‌లు కొత్త బంతిని పంచుకునే కొత్త కుర్రాళ్ళు భువనేశ్వర్, ఉనద్కత్, షమిలు కూడా విశాఖకు చేరుకున్నారు.
ఏర్పాట్లపై సమీక్ష... విండీస్‌తో భారత్ ఆడే రెండో వన్డేకు వైఎస్‌ఆర్ స్టేడియంలో ఏర్పాట్లను మరోసారి సమీక్షించారు. ఆటగాళ్ల భద్రత కోసం స్టేడియంలోకి వచ్చే క్రీడాభిమానుల్ని సైతం డేగ కళ్లతో పరిశీలించనున్నారు. ఇప్పటికే సమైక్యవాదులు తొలుత మ్యాచ్‌ను అడ్డుకుంటామని ప్రకటించినా అది కాస్త సద్దుమణిగింది. స్టేడియంలోకి ఎటువంటి బ్యానర్లు, ఆందోళనలకు తావియ్యకుండా నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేశాయి. మ్యాచ్ డే-నైట్ కావడంతో ఫ్లడ్‌లైట్లను మరోసారి పరీక్షించారు.
గేల్ ఆడతాడా...
కొచ్చిలో జరిగిన తొలి వన్డేలో గాయపడిన క్రిస్ గేల్ విశాఖ వచ్చాడు. పొట్టిఫార్మేట్‌లో విధ్వంసకర బ్యాటింగ్ చేసే క్రిస్‌గేల్ విశాఖవాసుల్ని బౌండరీలతో ఆలరిస్తాడని క్రీడాభిమానులు ఆశిస్తున్నారు. అయితే విశాఖలో జరిగే వన్డేలో ఆడతాడా లేదా అనేది సందేహమే. ఓపెనర్ కమ్ వికెట్‌కీపర్ చార్లెస్, బ్రేవో, సిమ్మన్స్‌లతో పాటు కెప్టెన్ డిజే బ్రేవో విశాఖ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చారు. బౌలర్లు రాంపాల్, హోల్డర్, నరేన్‌లతో పాటు సామి విశాఖ చేరుకున్నారు.
ఆటగాళ్లొచ్చేశారు...
Published Sat, Nov 23 2013 1:39 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement