శ్రీకాకుళం: సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించారు. ఇచ్ఛాపురం, నరసన్నపేట, రాజాం, చిలకపాలెం, శ్రీకాకుళం నగరాల్లో రోడ్‌షో నిర్వహించి, ప్రసంగించారు. సభలు వెలవెలబోయాయి. పాత హామీలనే వల్లె వేయడంతో ప్రసంగాలు ఆకట్టుకోలేకపోయాయి. రాజాం సభలో తనను నమ్మమని సీఎం పదేపదే కోరడం నవ్వు తెప్పించింది. డబ్బులిచ్చి జనాన్ని తీసుకొచ్చినా స్పందన సభలు కళ తప్పాయి. సంతకవిటి నుంచి ఉపాధి వేతనదారులను తరలించారు.
సాక్షి, శ్రీకాకుళంఅర్బన్/ఇచ్ఛాపురం/కంచిలి/రాజాం/ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ‘ఎన్నికలు వచ్చాయి...ఎవరి మాటలు వినొద్దు... ఎవరు డబ్బులిచ్చినా..తీసుకోవద్దు.. వారందరీ కంటే నేనే ఎక్కువ డబ్బులిస్తాను..నన్ను నమ్మం డి... నమ్ముతున్నారు కదా తమ్ముళ్లూ...నేను మిమ్మల్ని నమ్మొచ్చా తమ్ముళ్లూ’ అంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు ఓటర్లును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈయన ప్రస్తావించిన పాత హామీల్లో మచ్చుకు కొన్ని...
. జిల్లాలో నదుల అనుసంధానం కోసం కృషి చేస్తా, ఇచ్ఛాపురం నుంచి భోగాపురం వరకు బీచ్‌రోడ్ వేస్తా, శ్రీకాకుళంనకు రింగురోడ్డు, హైదరా బాదు తరహాలో బెస్ట్ సిటీగా మారుస్తా. మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చేందుకు కృషిచేస్తా.
. రాజాం సభలో రాజాంకు రింగురోడ్డు, రేగిడిలో జూనియర్ కళాశాల, వంగరలో వంతెన, సంతకవిటి మండలం వాల్తేరు వద్ద వంతెన నిర్మాణాలకు చేస్తా.
. నరసన్నపేటలో.. జమ్ము కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో నరసన్నపేట నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ నిర్మిస్తామని, ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు కట్టిస్తాం, ప్రతీ ఇంటికీ తాగునీరిస్తాం.
.ఎచ్చెర్లలోని చిలకపాలెంలో బహిరంగ సభలో 175 స్థానాల్లో తానే అభ్యర్థి అనుకుని ప్రజలు ఓటేయాలని పిలుపునిచ్చారు. జాబు రావాలంటే బాబే రావాలని పిలుపునివ్వడం కొసమెరుపు.
కోండ్రు ప్రస్తావించని సీఎం
సీఎం ఎన్నికల ప్రచారానికి పలు గ్రామాల నుంచి ఒక్కో వ్యక్తికి రూ 200 నుంచి రూ.300 ఇవ్వడంతోపాటు మద్యం పంపిణీ చేస్తామని రాజాం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ తీసుకొచ్చారు. సమావేశం ముగింపులో ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థి బాగా చేస్తున్నారని అన్నారే తప్పా పేరును మాత్రం ప్రస్తావించలేదు.
డబ్బుల పంపిణీ...
సీఎం సభ అవుతుండగానే రాజాంలో పాలకొండ రోడ్డులో డబ్బులు పంపిణీ ప్రారంభించారు. పలువురు కార్యకర్తలు ప్రజలకు రూ.100, రూ. 50 నోట్లు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ. 300 పంపిణీ చేశారు.
ఆశ్చర్యపర్చిన అన్నా క్యాంటీన్ కథ..
ఇచ్ఛాపురంలో ఇంతవరకు ‘అన్నాక్యాంటీన్’ లేకపోగా, అక్కడ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయి తమ్ముళ్లూ.. అంటూ సభలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా అడగటంతో అక్కడవారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీన్ని ఏర్పాటు చేయకుండానే రెండుసార్లు ప్రస్తావించడంతో పక్కనే ఉన్న ఎమ్మెల్యే అశోక్ సైతం నోరెళ్లబెట్టారు. అంతేకాకుండా ఇచ్ఛాపురం మాదిరిగానే సోంపేటలోనూ అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, అక్కడా తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు సభా వేదికలో ప్రకటించడంతో అంతా విస్తుపోయారు.
Comments
Please login to add a commentAdd a comment