సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, ఎంపీ విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నోటీసులు పంపించింది. పోస్టు ద్వారా వీటిని పంపి నట్లు టీటీడీ వర్గాలు వెల్లడించాయి. శ్రీవారికి భక్తులు సమర్పించిన విలువైన ఆభరణాలు మాయమయ్యాయని.. అందులో పింక్ డైమండ్ కూడా ఉందని రమణదీక్షితులు ఇటీవల ఆరో పించారు.
అలాగే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా పోటులో తవ్వకాలు జరిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సరైన సమాధాన మివ్వని పాలకమండలి.. రమణ దీక్షితులపై మాత్రం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొన్ని రోజుల కిందట నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రమణ దీక్షితులతో పాటు విజయసాయిరెడ్డికి నోటీసులు పంపిం చినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. టీటీడీపై చేసిన ఆరోపణలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది.
ఆరోపణలపై వివరణ ఇవ్వండి: టీటీడీ
Published Thu, Jun 14 2018 3:34 AM | Last Updated on Thu, Aug 9 2018 4:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment