
సాక్షి, తిరుపతి: తిరుపతి రుయా హాస్పిటల్‌లో ప్రైవేట్ అంబులెన్స్ ఆగడాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కొంతమంది అంబులెన్స్ వాళ్లు వ్యవహరించిన తీరు దారణమని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. రుయా ఆసుపత్రికి ఏ అంబులెన్స్ అయినా రావొచ్చు అని, అడ్డుకునే హక్కు ఎవరికి లేదని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంబెలెన్స్ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ యూనియన్ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రుయాలో బయటి అంబులెన్స్‌లకు అనుమతి ఉందన్న పోలీసులు ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. (త్రీస్టార్.. తిరుపతి వన్)