తనిఖీలలో నగదు పట్టివేత | police caught huge money in elections time | Sakshi
Sakshi News home page

తనిఖీలలో నగదు పట్టివేత

Published Wed, Apr 16 2014 2:19 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

తనిఖీలలో నగదు పట్టివేత - Sakshi

తనిఖీలలో నగదు పట్టివేత

 పద్మనాభం, న్యూస్‌లైన్ : ఆనందపురం మండలం తర్లువాడకు చెందిన తాటరాజు అప్పారావు కారులో రూ. 3 లక్షల 10 వేలు తరలిస్తుండగా పద్మనాభంలో సోమవారం రాత్రి పట్టుకున్నట్లు సీఐ ఆర్. నీలయ్య తెలిపారు. ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నాపురం నుంచి నీలకుండీలకు కారులో ఈ నగదు తరలిస్తుండగా పద్మనాభం పోలీస్ స్టేషన్ వద్ద టాస్క్ ఫోర్సు సీఐ రమణ. ఏఎస్‌ఐ మోహనరావు వాహనాలను తనిఖీ చేశారు.
 
 అర్ధరాత్రి వేళ ఈ కారును ఆపి తనిఖీ చేయగా కారులో  రూ. 3 లక్షల 10 వేలు లభ్యమయ్యాయి. ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో కారును, నగదును తాము స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
 
 టీడీపీ మాజీ సర్పంచ్ సోదరుడు?
 నగదుతో పట్టు బడిన తాటరాజు అప్పారావు ఆనందపురం మండలం తర్లువాడ మాజీ సర్పంచ్ ఆదినారాయణ సోదరుడుగా భావిస్తున్నారు. నగదుతో పట్టుబడిన  కారుపై తెలుగు దేశం పార్టీకీ చెందిన స్టిక్కర్లున్నాయి. దీంతో ఈ నగదు సార్వత్రి ఎన్నికల్లో  పంపిణీ చేయడానికి తరలిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement