నెల్లూరు (సెంట్రల్) : శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. ప్రభుత్వ ఉద్యోగులమనే విషయం మరిచి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నెల్లూరులోని రంగనాయకులపేటలో గురువారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వారు వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. సిటీ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌తో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు జన్మభూమి కార్యక్రమానికి హాజరయ్యారు. వీరిపై మూడో
నగర ఇన్‌స్పెక్టర్ వెంకటరత్నం జులుం ప్రదర్శించారు. అక్కడ ఎలాంటి గొడవ లేకపోయినా పోలీసులే హడావుడి సృష్టించారు. ప్రజాప్రతినిధులనే గౌరవం లేకుండా దుర్భాషలాడారు. కార్పొరేటర్లను పత్రికల్లో రాయలేని భాషలో తిడుతూ ఈడ్చుకుంటూ వెళ్లారు. వెంకటరత్నం ఇన్‌స్పెక్టర్‌ననే విషయం మరిచి అధికారపార్టీ నాయకుడిగా వ్యవహరించిన తీరుపై స్థానికులు విస్తుపోయారు. ప్రజాప్రతినిధులను నోటికొచ్చినట్టు తిట్ట డం సరికాదని ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ వారిం చినా పోలీసులు ఖాతరు చేయలేదు. అధికారపార్టీకి చెందిన ఓ నేత ఆదేశానుసారం ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేతో వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను వేదిక వద్దకు రాకుండా దౌర్జన్యంగా అడ్డుకున్న పోలీసులు, మేయర్ అనుచరులు, టీడీపీ అనుచరులను మాత్రం అనుమతించడం గమనార్హం. మేయర్ అజీజ్ ప్రోద్బలంతోనే పోలీసులు ఇలా వ్యవహరించారని స్థానికులు బహిరంగంగా చర్చించుకోవడం కనిపించింది. తాను మేయర్ కావడానికి కీలకపాత్ర పోషించిన కార్పొరేటర్లను పోలీసులు అవమానపరుస్తుంటే కనీసం వారించకుండా అజీజ్ మౌనం దాల్చడం ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నించారు.
ఏంటి ‘భాయ్’ ఇది?
‘ఏంటి అజీజ్ భాయ్. మనము ఈ రోజు మేయర్‌గా ఉన్నామంటే దానికి కారణం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా? ఆ పార్టీ ఇచ్చిన టికెట్ మీదే మీరు కార్పొరేటరుగా.. మేయర్ కాగలిగింది ? ఎన్నో సంవత్సరాల తరువాత ముస్లింలకు వైఎస్‌ఆర్‌సీపీ గౌరవం ఇచ్చింది. పార్టీ మారాము ఓకే... మనమే ఆ పార్టీ నాయకులపై దాడులు చేయించడం, పోలీసులను ఉసిగొల్పడం బాగోలేదు భాయ్’ అని అక్కడున్న పలువురు ముస్లింలు మేయర్‌ను ప్రశ్నించటం కనిపించింది.
వైఎస్ఆర్ సీపీ నేతలపై దౌర్జన్యం
Published Fri, Oct 31 2014 11:22 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement