అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
Published Mon, Jan 27 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
ఏలూరు, న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశ సమైక్యతను చాటాయి. పరేడ్ గ్రౌండ్ వేలాదిమంది విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఏలూరు శ్రీశ్రీ విద్యాసంస్థ విద్యార్థులు జాతీయ జెండా ఔన్నత్యాన్ని చాటుతూ నిర్వహించిన రిబ్బన్ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలి చింది. భీమవరం కాకతీయ ఇంగ్లిష్ మీడియం పాఠశాల వి ద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ఏలూరు సెయింట్ థెరి స్సా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల నృత్యాలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. కోటరామచంద్రపురం కామయ్యకుంట గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల రేలారేరేలారే.. అంటూ గిరిజన సంప్రదాయాన్ని ప్రదర్శించారు.
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల తీరుతెన్నులను వివరిస్తూ ప్రభుత్వ శకటాల ప్రదర్శన కూడా సభికులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది అగ్నిమాపక శాఖ, ఎన్నికల సంఘం కార్యక్రమాలను వివరిస్తూ శకటం, జిల్లా నీటి యజమాని సంస్థ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నీరు, పారిశుద్ధ్యమిషన్, హౌసింగ్, 108, 104, ఎయిడ్స్ కంట్రోల్ సంస్థల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. హౌసింగ్ శకటానికి ప్రథమస్థానం లభించింది. రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ పి.మరియన్‌రాజు ఆధ్వర్యంలో పోలీస్‌పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌లో ఆర్‌ఎస్‌ఐ బి.శ్రీనివాసరావు, కేఆర్‌ఎస్‌ఐ కె.చల్లన్నదొర ఆధ్వర్యంలో పాల్గొన్న సెకండ్ ప్లాటూన్‌కు ఉత్తమ కంటింజెంట్ అవార్డు లభించింది.
ఉపకరణాల పంపిణీ
వివిధ సంక్షేమ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కలెక్టర్, ఇతర అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఏ ద్వారా స్వయం సహాయ సంఘాలకు రూ.64 లక్షల విలువైన ఉపకరణాలు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా రూ.32 కోట్లు మహిళా సంఘాలకు రుణాలుగా అందించామని కలెక్టర్ చెప్పారు. ఇటీవల ఉత్తారాఖండ్ వరదల్లో మృతి చెందిన జంగారెడ్డిగూడెం బాధితులకు రూ.10 లక్షల చెక్‌ను కలెక్టర్ అందజేశారు. గల్ఫ్‌లో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 4,40,820, ప్రమాదవశాత్తూ మరణించిన17 మంది కల్లుగీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్ అందజేశారు.జేసీ టి.బాబూరావునాయుడు, ఎక్సైజ్ శాఖ డీసీ చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement