భద్రతా వలయంలో సచివాలయం
Published Wed, Jul 26 2017 11:04 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
అమరావతి: కాపు ఉద‍్యమ నేత ముద్రగడ పద్మనాభం ఛలో అమరావతి పిలుపు మేరకు బుధవారం సచివాలయానికి వచ్చే మార్గాలన్నింటిలోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే కరకట్ట మార్గంలో తెలిసిన వాహనాలు తప్ప ఇతర వాహనాలను అనుమతించడం లేదు. సచివాలయానికి వచ్చే మార్గంలోనూ వివరాలు తెలుసుకుని మాత్రమే వాహనాలు అనుమతిస్తున్నారు.
నేతల గృహ నిర్బంధం
ముద్రగడ పద్మనాభం చలో అమరావతి పాదయాత్ర ప్రారంభిస్తున్నందున కాపు సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్డకుండా కృష్ణా జిల్లాలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. కాపు నేతలు బయటకు రాకుండా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. సామినేని ఉదయభాను, నరహరశెట్టి నర్సింహారావు, మల్లేశ్వర రావు నాయుడు తదితర నేతలను గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీస్ చర్యలపై కాపు నేతలు మండిపడుతున్నారు.
Advertisement
Advertisement