
ప్రతీకాత్మక చిత్రం
మహబూబ్‌నగర్ క్రైం: ఇంటి ఎదుట నిలిపిన కారుపై ఓ కుర్రాడు రాయితో గీతలు గీశాడని ఓ వ్యక్తి డబ్బులు ఇవ్వాలని ఆ కుర్రాడిని ఇంట్లో నిర్బంధించినట్లు సమాచారం. పట్టణంలోని టీచర్స్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తి తన కారు ఇంటి ఎదుట నిలిపితే పక్క ఇంటికి చెందిన ఓ బాలుడు రాయితో కారుపై గీతలు గీశాడు.
దీంతో కారు యజమాని కారుకు మరమ్మతు చేయించడానికి అవసరం అయ్యే డబ్బు ఇవ్వాలని బాలుడిని తన ఇంట్లో నిర్బంధించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే రెండు కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment