పేలుడు పదార్థాలు స్వాధీనం | Possession of explosive substances | Sakshi
Sakshi News home page

పేలుడు పదార్థాలు స్వాధీనం

Published Sun, Feb 9 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

Possession of explosive substances

ఖమ్మం క్రైం, న్యూస్‌లైన్: నగరంలో పెద్ద సంఖ్య లో పేలుడు పదార్థాలను పోలీసులు శనివారం స్వాధీనపర్చుకున్నారు. ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్ పోలీసులు శనివారం తెల్లవారుజాము నుంచి  ఉదయం ఎనిమిది గంటల వర కు ఆపరేషన్ సీజ్‌పోర్ట్ (నాకాబందీ) నిర్వహించారు. ఆ సమయంలోనే, భారీగా పేలుడు పదార్థాలు నిల్వ ఉన్నాయన్న సమాచారంతో టూటౌన్ సీఐ సాదుల సారంగపాణి ఆధ్వర్యంలో పోలీసులు ఖమ్మం బైపాస్ రోడ్డులోగల శ్రీరామ్‌నగర్‌లోని బోడపట్ల సుదర్శన్‌రావు ఇం టికి వెళ్లి తనిఖీ చేశారు.

 అక్కడ 320 జిలెటిన్ స్టిక్స్, 250 డిటొనేటర్లను స్వాధీనపర్చుకున్నారు. సుదర్శన్‌రావును అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన బోళ్ళ నాగేశ్వరరావు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ 1000 జిలెటిన్ స్టిక్స్, 580 డిటొనేటర్లు స్వాధీనపర్చుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసే ఇద్దరు వ్యక్తులు (నాగయ్య, వెంకటయ్య) పరారీలో ఉన్నారు. ఈ తనిఖీల్లో వన్ టౌన్ సీఐ రమణమూర్తి, త్రీటౌన్ సీఐ రహ్మాన్, టూ టౌన్ ఎస్సైలు స్వామి, సురేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. నగరంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్, ఇతర ప్రధాన కూడళ్లలో కూడా పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేశారు.

 అదుపులో దొంగ.. వెండి స్వాధీనం
 వాల్యతండా (ఖమ్మం రూరల్): నాకాబందీ నిర్వహిస్తున్న రూరల్ పోలీసులకు శనివారం దొంగ పట్టుబ డ్డాడు. అతని నుంచి రెండు వెండి బిందెలు, వెండి గ్లాసులు, వెండి ప్లేట్లు (మొత్తం నాలుగు కేజీలు) స్వాధీనపర్చుకున్నారు. వాల్యతండావద్ద ముల్కల పల్లి క్రాస్ రోడ్ సమీపంలో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం వాహనాల తనిఖీ (నాకాబందీ) చేపట్టారు. ఖమ్మం వైపు నుంచి వచ్చిన ఆటో ఆగకుండా వెళుతుండడంతో పోలీసు లు వెంబడించి పట్టుకున్నారు. అందులోని ఓ వ్యక్తి తీరు అనుమానస్పదంగా ఉండడంతో ఆటో ను తనిఖీ చేయగా... వెండి వస్తువులు కనిపిం చాయి. వాటిని పోలీసులు స్వాధీనపర్చుకుని, అందులోని అనుమానిత వ్యక్తిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 100 లీటర్ల నాటు సారా ధ్వంసం
 నాకాబందీలో భాగంగా మండలంలోని కైకొండాయిగూడెంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దా డులు నిర్వహించారు. 100లీటర్ల సారా ధ్వంసం చే శారు. ఐదుగురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement